తెలంగాణ ఎన్నికలను(TS Elections) ప్రభావితం చేసిన హామీల్లో కీలక పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current) ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్(CM revanth Reddy), కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు.
తెలంగాణ ఎన్నికలను(TS Elections) ప్రభావితం చేసిన హామీల్లో కీలక పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current) ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్(CM revanth Reddy), కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. దీంతో ప్రజల నుంచి ఈ పథకం అమలు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్లు వరకు వాడేవారు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడంతో బిల్లులు వసూలు చేసుకునేందుకు వస్తున్న విద్యుత్ సిబ్బందిని వినియోగదారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు దృష్టికి తీసుకురాగ.. దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకానికి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకే(White Ration Card) ఈ పథకాన్ని వర్తింప చేయాలా లేదా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత అందరికీ వర్తింపచేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే ఈ పథకం వర్తిస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. గృహాలకు సంబంధించిన హైదరాబాద్ సహా రూరల్ ప్రాంతాల్లో భారీగా బకాయిలు ఉన్నాయని దీంతో ఈ బకాయిలను వసూలు చేయాలని అధికారులు ఆశిస్తున్నారు. పాత బకాయిల వసూలుకు ఇదే మంచి తరుణమని అధికారులు భావిస్తున్నారట. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 6 వేల కోట్ల బకాయిలున్నాయని.. కొన్ని నెలలు, ఏళ్ల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో వేల కోట్ల బకాయిలు డిస్కంలకు రావాల్సి ఉందని లెక్కలు చెప్తున్నారు. పాత బకాయిలు చెల్లించకపోతే.. ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించాలని భావిస్తున్నారట.