తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(TS Elections 2023) ముగిసాయి. ఇక ఆదివారం శుభం కార్డు పడటం మాత్రమే మిగిలి ఉంది. విజేతలెవరో, పరాజితులెవరో తెలిసిపోతుంది. ఇంతకాలం పడిన ఉత్కంఠకు తెరపడుతుంది. ఎన్నికల షెడ్యూల్‌(Election schedule) వచ్చినప్పట్నుంచి రకరకాల ప్రచారాలు వినిపించాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(TS Elections 2023) ముగిసాయి. ఇక ఆదివారం శుభం కార్డు పడటం మాత్రమే మిగిలి ఉంది. విజేతలెవరో, పరాజితులెవరో తెలిసిపోతుంది. ఇంతకాలం పడిన ఉత్కంఠకు తెరపడుతుంది. ఎన్నికల షెడ్యూల్‌(Election schedule) వచ్చినప్పట్నుంచి రకరకాల ప్రచారాలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలెన్నో జరిగాయి. ఊహించనటువంటి ప్రచారాలు కూడా జరిగాయి. కొన్ని సంచలన నిజాలు కూడా ఉన్నాయి. షెడ్యూల్‌ రాక మునుపే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS) అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించింది.

30 నుంచి 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దొరకడం కనాకష్టమని భావించిన వారికి కేసీఆర్‌ ప్రకటన ఓ రకంగా దిగ్బ్రాంతినే కలిగించింది. పార్లమెంట్‌(Parliament) సమావేశాలపై ఆకస్మిక ప్రకటన రావడంతో అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానం కలిగింది చాలా మందికి. జమిలీ ఎన్నికల(Jamili Elections) కోసమే పార్లమెంట్‌ సమావేశాలు అనే ప్రచారం జరగడంతో తొందరపడి అభ్యర్థులను ప్రకటించామా అన్న ఆలోచనలో పడింది బీఆర్‌ఎస్‌(BRS). ఆ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలలో జమిలీపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌కు ఊరట కలిగింది. మరోవైపు నామినేషన్ల తేదీ దగ్గరపడిన తర్వాత కానీ కాంగ్రెస్‌(Congress) పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.

ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు కాంగ్రెస్‌లో చేరిన ఓ 40 మందికి టికెట్లు ఇచ్చింది. ఇదిలా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును స్కిల్‌ స్కామ్‌లో అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో పడుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌(KCR) మాట్లాడిన కొన్ని మాటలు చంద్రబాబు(Chandrababu) అభిమానులకు కోపం తెప్పించింది. బాబు ఫ్యాన్స్‌కు ఆగ్రహం కలిగిందని గుర్తించిన కేటీఆర్‌ నష్ట నివారణ కోసం ఎన్టీఆర్‌ను పొగడటంతో పాటుగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రవారి మెప్పు కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ప్రచారం మొదలయ్యింది. సీమాంధ్రులంతా బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారని, కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి సిద్ధమయ్యారని చెప్పుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికలు కూడా చంద్రబాబు సెంట్రిక్‌గానే జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో కాంగ్రెస్‌ కూటమి కట్టింది. దాంతో తెలంగాణపై మళ్లీ పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారనే వాదన తెరమీదకు వచ్చింది. తెలంగాణ సమాజం కూడా ఇదే భావించింది. ఫలితంగా కాంగ్రెస్‌కు రావాల్సినన్ని సీట్లు రాలేదు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది.

ఈసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు కేంద్రబిందువు కావడం విశేషం. చంద్రబాబు అరెస్ట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ చెప్పుకుంటూ వచ్చింది. కిందటిసారి ఎన్నికల్లో చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు మాత్రం చంద్రబాబు జోలికి వెళ్లలేదు. చంద్రబాబును విమర్శిస్తే సెటిలర్ల ఓట్లు పోతాయేమోనన్న భయం కావచ్చు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఖండించినప్పటికీ తాము చంద్రబాబు వైపు లేమని చెప్పుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబుతో కలిస్తే కిందటిసారిలాగే అవుతుందేమోనని భయపడింది.

చంద్రబాబునాయుడకు ప్రియ శిష్యుడైన రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు పేరు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో రాజశేఖర్‌ రెడ్డి పాత్ర అమోఘమన్నారే కానీ పొరపాటున కూడా చంద్రబాబు పేరు తీయలేదు. హైటెక్ సిటీ నిర్మాణం కూడా కాంగ్రెస్‌ ఘనతేనన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు రేవంత్‌. గెలుపు సంకేతాలు కనిపిస్తున్న వేళ ఇలాంటి పనులు చేయకూడదని రేవంత్‌ భావించారేమో! చంద్రబాబుకు సంబంధించిన ఇమేజ్‌ తనపై పడితే నష్టం జరుగుతుందని అనుకున్నారు కాబోలు! అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన మీడియాను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. సాక్షి చానెల్‌లో కూర్చుని మరి ఇంటర్వ్యూ ఇచ్చారు రేవంత్‌.

రాజశేఖర్‌రెడ్డిని విపరీతంగా పొగిడారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులను పొగుడుతూ వచ్చారు. ఇలాంటి మాటలు రేవంత్‌రెడ్డి నోటి వెంట ఇంతకు ముందెప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకవార్తలు రాస్తూ చంద్రబాబు అనుకూల మీడియాగా(Media) ముద్రపడిన ఓ మీడియా సంస్థకు కేటీఆర్‌ వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చారు. కేటీఆర్‌ ఆ ఛానెల్‌కు వెళతారని, ఆ మీడియా సంస్థ అధినేతకు ఇంటర్వ్యూ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రేవంత్‌ రెడ్డి పెద్ద దిక్కు అయ్యారు. రాష్ట్రమంతా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఇక బీఆర్‌అస్‌ అధినేత కేసీఆర్ ప్రసంగాలలో మునుపటి వాడి వేడి లోపించాయన్నది సామాన్యుడి భావన. నిజానికి కేసీఆర్‌ ప్రసంగాలలో కొత్తద…

Updated On 2 Dec 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story