TS elections Results : మొదలైన ఓట్ల లెక్కంపు, తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ
తెలంగాణ(Telangana), మధ్యప్రదేశ్(madhyapradesh), రాజస్థాన్(Rajasthan), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(assembly elections counting) మొదలయ్యింది.
తెలంగాణ(Telangana), మధ్యప్రదేశ్(madhyapradesh), రాజస్థాన్(Rajasthan), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(assembly elections counting) మొదలయ్యింది.మొదలైన ఓట్ల లెక్కంపు, తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణలో ఊహించినట్టే కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ (congress)ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ(BJP), కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటి వరకు 87 స్థానాలలో కాంగ్రెస్ 53 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీఆర్‌ఎస్ 28 స్థానాలలో ముందంజలో ఉంది. బీజేపీ, ఎంఐఎంలు చెరో మూడు స్థానాలలో ముందంజలో ఉన్నారు.
ఇల్లందు (Illandu)తొలిరౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
నల్లొండ (Nalgonda)తొలి రౌండ్‌లో కోమటిరెడ్డికి 4 వేల ఓట్ల ఆధిక్యం
గజ్వేల్‌లో (Gajwel)తొలి రౌండ్‌లో కేసీఆర్‌కు ఆధిక్యం
అశ్వారావుపేట (ashwaraopet)తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
భువనగిరి(bhuavanagiri)తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం