తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress) అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవడంతో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress) అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవడంతో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. వాయిదా పడ్డ పరీక్షలు, మెగా డీఎస్సీపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ముందుగా మెగా డీఎస్సీ వేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.

2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల(Teacher Post) భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notifications) ఇచ్చి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. విద్యాశాఖలోని అన్ని బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి అధికారుల నుంచి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టుల కంటే అదనంగా మారో 6 వేల పోస్టులు కలిపి.. దాదాపు 12 వేల పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొని అందుకు తగ్గ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సారి మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కలిపే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది. ఈ నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated On 6 Jan 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story