హైదరాబాద్: మంగళవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Telangana Cabinet Expansion
హైదరాబాద్: మంగళవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రివర్గంలో ఈటెలతో(Etela Rajendhra) ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి(Patnam Mahinder Reddy) కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే భారాస అభ్యర్థులను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
