Kishan Reddy Meets Srisailam Yadav : చిన్న శ్రీశైలం యదవ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ(BJP) చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) జూబ్లీహిల్స్‌లోని(Jubliee Hills) చిన్న శ్రీశైలం యదవ్(Srisailam Yadav) ఇంటికి వెళ్లారు. చిన్న శ్రీశైలం యదవ్ తనయుడు నవీన్ యాదవ్(Naveen Yadav) జూబ్లీహిల్స్ స్వతంత్య్ర అభ్యర్ధిగా(Independent Candidate) ఎన్నికల బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ లంకల దీపక్ రెడ్డిని అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ వెళ్లిన కిషన్ రెడ్డి.. చిన్న శ్రీశైలం యదవ్ ఇంటికి వెళ్లారు.

Kishan Reddy Meets Srisailam Yadav

ఈ విషయమై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం మర్యాద పూర్వకంగా భేటీ మాత్రమేనన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లంకాల దీపక్ రెడ్డికి(Lankala Deepak Reddy) మద్దతు ఇవ్వాలని కోరేందుకు మాత్రమే ఇక్కడకి రావడం జరిగిందన్నారు. ఈ భేటీకి ఏలాంటి రాజకీయ కారణాలు లేవు.. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం రాలేదని తెలిపారు.
ఈ భేటీపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. నేను బీజేపీ(BJP) పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మా నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని స్పష్టత ఇచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాధ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీలో నిలిచారు. ఈ నిజయోకవర్గంలో ఈ సారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, నవీన్ యాదవ్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు. దీంతో ఎలాగైన ఈ సీటును దక్కించకోవాలని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలోకి దింపింది. నవీన్ యాదవ్ కూడా గడిచిన రెండు పర్యాయాలుగా గోపీనాధ్ కు గట్టీ పోటీ ఇస్తూ వస్తున్నారు. దీంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది.