తెలంగాణ బీజేపీ(TSBJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLA's) బీజేపీతో(BJP) టచ్ లో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్(Congress) పార్టీని పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్(KCR) ఆర్ధిక సాయం(Financial help) చేయనున్నారని వ్యాఖ్యానించారు.

Bandi Sanjay
తెలంగాణ బీజేపీ(TSBJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLA's) బీజేపీతో(BJP) టచ్ లో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్(Congress) పార్టీని పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్(KCR) ఆర్ధిక సాయం(Financial help) చేయనున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ అంటున్నారు.. బీఆర్ఎస్ మాదిరి తాము రాజకీయ వ్యభిచారం చేయమని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు.. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని బీజేపీలోకి చేర్చుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదలిపెట్టదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
