హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్(Jubilee Hills) ఒకటి. పేరుకే పెద్దలు ఉండే ఏరియా..కానీ ఎన్నికలొస్తే(Elections) ఓటేసిది మాత్రం బస్తీవాసులే(Slum). ఇక్కడి ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ..వినూత్నమైన తీర్పునిస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్(Jubilee Hills) ఒకటి. పేరుకే పెద్దలు ఉండే ఏరియా..కానీ ఎన్నికలొస్తే(Elections) ఓటేసిది మాత్రం బస్తీవాసులే(Slum). ఇక్కడి ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ..వినూత్నమైన తీర్పునిస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు. ఈసారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి పట్టగట్టబోతున్నారు? మరోసారి గులాబీ జెండా ఎగురుతుందా? కాంగ్రెస్(Congress) జోరు ఈసారైనా కనిపిస్తుందా? జూబ్లీహిల్స్ కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం.. మా విశ్లేషణలో చూద్దాం.

2009లో జరిగిన పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజవర్గం ఏర్పడింది. అంతకు ముందు ఖైరతాబాద్(Khairathabad) నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే.. 3 పార్టీలను గెలిపించి విలక్షణ తీర్పు ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. మొదటిసారి ఇక్కడి నుంచి పీజేఆర్(PJR) తనయుడు విష్ణువర్ధన్‎రెడ్డి(Vishnuvardhan Reddy) గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్(Maganti Gopinath)..ఆ తర్వాత గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన మాగంటి..మరోసారి విజయఢంకా మోగించారు. ఈసారి కూడా మాగంటికే అధిష్టానం సీటు కేటాయించడంతో..హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగటంటి గోపినాథ్.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, షేక్‌పేట డివిజన్లతో పాటు శ్రీనగర్‎కాలనీ(Srinagar Colony) డివిజన్‌లో సగభాగం ఇందులోకి వస్తుంది. ఇక్కడ నేతల గెలుపోటములను ప్రభావితం చేసేది బస్తీవాసులే. పేరుకు జూబ్లీహిల్స్ అయినా ఖరీదైన విల్లాలున్నా నియోజకవర్గం వ్యాప్తంగా కాలనీలు, బస్తీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌లో దివంగత నేత పీజేఆర్ హవా నడిచేది. ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్(PJR) అనే విధంగా ఉండేది. గెలుపోటములతో సబంధం లేకుండా ఆయన ప్రజల నడుమే ఉండేవారనడం.. ప్రజామద్దతు ఉండేదనడం అతిశయోక్తికాదు. ఆయనపై అభిమానంతోనే ఆయన కుమారుడు విష్ణువర్ధన్‎రెడ్డికి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగానూ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగానూ..రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు.

బీఆర్ఎస్(BRS) విషయానికొస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్.. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలవడం వల్ల.. సాధారణంగా ఉండే వ్యతిరేకతకు తోడు.. పార్టీలోనూ గ్రూపులు ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతోనే.. మరోసారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో బస్తీ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. వారిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‎రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. విష్ణు సైతం పార్టీ(Vishnu Saitham Party) కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. పీజేఆర్ కూతురు విజయారెడ్డి సైతం ఖైరతాబాద్ గానీ జూబ్లీహిల్స్ నుంచి గానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో పీజేఆర్ వారసులైన ఇద్దరికీ.. కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తుందా? ఒకరికి చెక్ పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. విజయారెడ్డి రేవంత్‎రెడ్డి(Revanth Reddy) వర్గంలో ఉండగా.. విష్ణు ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్నారు. దాంతో.. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీఆర్ మరణం తర్వాత విష్ణువర్ధన్‎రెడ్డి ప్రాతినిథ్య వహిస్తున్నా పీజేఆర్ కు ఉన్న ఓర్పు నేర్రపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం క్రమేపీ ఆ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికీ పీజేఆర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా ఉన్నా సమర్దవంతంగా నడిపించే నాయకులు లేక పార్టీ చతికిలపడిపోయింది. దీంతో దశాబ్దకాలంపాటు వెన్నంటి నడిచిన కేడర్ దిక్కు లేకుండాపోయింది. అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక మెజారిటీ నాయకులు పార్టీలు మారినా.. ఉన్న కొంత మంది పీజేఆర్ ను మరువలేక.. వదలక పార్టీలోనే కొనసాగుతున్నారు

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో(Jubilee Hills Constituency) పర్యటిస్తున్నారు. ముఖ్య నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటముల్లో ముస్లిం ఓట్లే కీలకం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజహరుద్దీన్ ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం సూచనల మేరకే అజహరుద్దీన్ పర్యటన సాగిందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బరిలో అధిష్టానం మాజీ ఎమ్మెల్యే పీవీఆర్ కు టికెట్ ఇస్తుందా? కొత్త నేతలకు అవకాశం కల్పిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.

ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే వుంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ(BJP) హవా కొనసాగినా జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో మాత్రం ఒక్క డివిజన్ కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఇక్కడ మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా బీజేపీ వెనుకబడి ఉండటానికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకాల దీపక్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. అలాగే ప్రముఖ సామాజిక వేత్త కీర్తి రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరోసారి జెండా ఎగరేస్తుందా? కాంగ్రెస్ కు పూర్వవైభవం లభించేనా..? గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 28 Oct 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story