ఉమ్మడి నిజామాబాద్(Nizambad) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం(Yellareddy constituency) రూటే సపరేట్. జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తయితే..ఎల్లారెడ్డి పాలిటిక్స్ మరో ఎత్తు. ఎల్లారెడ్డి ఓటర్ల విలక్షణమైన తీర్పు రాజకీయ పార్టీలను కంగారెత్తిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్(Congress) కంచుకోటైన ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఏర్పాటు తర్వాత గులాబీ గుభాళిస్తే..గత ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ పాగావేసింది. అయితే గెలిచిన తర్వాత హస్తానికి హ్యాండిచ్చి..

ఉమ్మడి నిజామాబాద్(Nizambad) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం(Yellareddy constituency) రూటే సపరేట్. జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తయితే..ఎల్లారెడ్డి పాలిటిక్స్ మరో ఎత్తు. ఎల్లారెడ్డి ఓటర్ల విలక్షణమైన తీర్పు రాజకీయ పార్టీలను కంగారెత్తిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్(Congress) కంచుకోటైన ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఏర్పాటు తర్వాత గులాబీ గుభాళిస్తే..గత ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ పాగావేసింది. అయితే గెలిచిన తర్వాత హస్తానికి హ్యాండిచ్చి..కారెక్కిన ఎమ్మెల్యే..మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ నువ్వా..నేనా అన్నట్టు తలపడుతుంటే..బీజేపీ(BJP) సైతం సమరానికి సై అంటోంది. మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‎ కంచుకోట. కానీ 2009 నుంచి ఈ సెగ్మెంట్‌లో గులాబీ జెండా ఎగురుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్‎లోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ గుభాళిస్తే.. ఇక్కడ మాత్రం హస్తం పార్టీ హవా కొనసాగింది. కానీ, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జాజుల సురేందర్(Jajala Surender).. ఆ తర్వత హస్తానికి హ్యాండిచ్చి..గులాబీ కారెక్కారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జాజుల సురేందర్, సమీప ప్రత్యర్థి ఏనుగు రవీందర్‎రెడ్డిపై(Enugu Ravinder Reddy) 35 వేల 148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఇద్దరూ పార్టీలు మారారు. సురేందర్ గులాబీ గూటికి చేరగా.. కారుదిగి కమలదళంలో చేరిన రవీందర్‎రెడ్డి..తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నియోజవకర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి, తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఏనుగు రవీందర్‌రెడ్డి. ఇక్కడి నుంచి ఆయన నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది, కారెక్కిన ఎమ్మెల్యే జాజులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు, కేడర్ సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్నా.. వడ్డేపల్లి సుభాష్‎రెడ్డి(Vaddepally Subhash Reddy), మదన్ మోహన్(Madhan Mohan) మధ్య నేతల ఆధిపత్య పోరు క్యాడర్‎ను కలవరపెడుతోంది. ఒకవేళ అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే.. గ్రూప్ పాలిటిక్స్ కాంగ్రెస్ ను పుట్టి ముంచడం ఖాయమనే ఆందోళన కాంగ్రెస్ క్యాడర్‌లో కనిపిస్తోంది.

ఇక కాంగ్రెస్ నుంచి గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) తో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కు మాత్రం రాబోయే ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్‎లోకి వెళ్లడంపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జాజుల చెబుతుంటే..ఎల్లారెడ్డిలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని విపక్ష నేతలు వాదిస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ చేస్తున్నారు విపక్ష నేతలు. తాడ్వాయిలో భీమేశ్వర ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా వదిలేశారని విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఐదేళ్లలో కార్యకర్తలు ఆపదలో ఉంటే ఫోన్ ఎత్తకపోవడం.. పాత కేడర్ ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వంటివి ఎమ్మెల్యేకు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఈ సవాళ్లను, సమస్యలను ఎమ్మెల్యే జాజుల సురేంద్ ఎలా అధిగమిస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ సైతం గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి..తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం బాణాల లక్ష్మారెడ్డి(Banala Laxma Reddy) ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చవి చూశారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో...అధిష్టానం మరోసారి తనకే అవకాశం కల్పిస్తుందన్న ధీమాతో ఉన్నారు బాణాల లక్ష్మారెడ్డి.

ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఏడు వేల 675 ఓట్లు ఉండగా, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 8 మండలాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మూడు పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలో దిగిపోయినట్లే కనిపిస్తున్నారు. ప్రత్యేక వ్యూహాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఎవరూ ఆపలేరని.. 90 శాతం పనులు పూర్తి చేశానని.. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే సురేందర్ చెబుతున్నారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బీసీలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరుకాపు వర్గం కాగా, ఇద్దరు గౌడ సామాజికవర్గం. మూడుసార్లు ఎస్సీలు ప్రాతినిధ్యం వహించారు.

మొత్తానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మూడు పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ సారి సత్తాచాటాలని చూస్తోంది. మొత్తానికి ముక్కోణ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

Updated On 27 Oct 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story