ఒకప్పుడు ఎల్బీనగర్‌(LB Nagar) హైదరాబాద్‌(Hyderabad) నగరానికి శివారు ప్రాంతాం. రానురాను ఎల్బీనగర్‌ ప్రాంతం నగరంలో కలిసిపోయింది. 2009లో ఎల్బీనగర్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. ఎల్బీనగర్, హయత్‌నగర్(Hayath nagar), బీఎన్‌రెడ్డినగర్(BN Reddy), వనస్థలిపురం(Vanastalipuram), హస్తినాపూరం(Hastinapuram), కర్మన్‌ఘాట్, చంపాపేట్, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌లోని కొంత భాగం, గడ్డి అన్నారంలోని కొంత భాగంతో కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు ఎల్బీనగర్‌(LB Nagar) హైదరాబాద్‌ నగరానికి శివారు ప్రాంతాం. రానురాను ఎల్బీనగర్‌ ప్రాంతం నగరంలో కలిసిపోయింది. 2009లో ఎల్బీనగర్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. ఎల్బీనగర్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హస్తినాపూరం, కర్మన్‌ఘాట్, చంపాపేట్, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌లోని కొంత భాగం, గడ్డి అన్నారంలోని కొంత భాగంతో కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మీ నియోజకవర్గంపై మా విశ్లేషణ చూద్దాం...!

ఎన్నికల కమిషన్‌(Election Commmission) వెల్లడించిన జాబితా ప్రకారం తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఎల్బీనగర్‌ నిలిచింది. ఇందులో పురుషులు 1,58,71,493 మంది, మహిళలు 1,58,43,339 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్ల తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్బీనగర్‌, వనస్థలిపురంలో ఏపీ నుంచి వచ్చినవారు అధికంగా ఉండేవారు. రానురాను నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నుంచి వలస వచ్చిన ప్రజలు ఎల్బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

2009లో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి(Sudheer Reddy) కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా గెలిచారు. అప్పటివరకు హుడా చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీ, బీజేపీ(BJP) పొత్తులో భాగంగా టీడీపీ(TDP) అభ్యర్థిగా కృష్ణయ్యను(Krishnaiah) బరిలో దింపారు. బీఆర్‌ఎస్‌(BRS) (అప్పట్లో) టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామ్మోహన్‌గౌడ్‌కు(Ram Mohan Goud) టికెట్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా కృష్ణయ్య గెలుపొందారు. రెండో స్థానంలో రామ్మోహన్‌గౌడ్‌ నిలిచారు. సుధీర్‌రెడ్డికి మూడో స్థానం దక్కింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సుధీర్‌రెడ్డికి అవకాశం వచ్చింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెండోసారి రామ్మోహన్‌గౌడ్‌కే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి 1900 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ఆ తర్వాత సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ... నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తానని ఆ మేరకు మంత్రి కేటీఆర్‌ హామీ తీసుకొని బీఆర్‌ఎస్‌లో చేరారు.

సుధీర్‌రెడ్డి చెప్పినట్లే ఎల్బీనగర్‌ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. ఎల్బీనగర్‌ చౌరస్తా, బైరామల్‌గూడ చౌరస్తా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. పదులకొద్దీ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఇంకా కొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో అధునాతన శ్మశానవాటికను సుధీర్‌రెడ్డి నిర్మించారు. తాగునీరు సహా పలు సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా గత 30 ఏళ్లుగా ప్రజల మెడపై కత్తిలా వేలాడుతున్న రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ మధ్యే దాదాపు 18వేల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ పట్టాలు పొందారు. 58, 59 జీవోల కింద సీలింగ్‌లో ఉన్న ప్లాట్లకు కూడా పట్టాలు అందజేశారు.

అయితే 2023లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమమే తనను గెలిపిస్తుందని సుధీర్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. నిరంతరం తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని చెప్తున్నారు సుధీర్‌రెడ్డి. ప్రతీ రోజూ ఏదో ఒక కాలనీలో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటానని సుధీర్‌రెడ్డి అంటున్నారు. సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్‌(KTR) అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని, ప్రజలు తననే గెలిపించుకుంటారని సుధీర్‌రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నాడు.

మరోవైపు అనూహ్యంగా కాంగ్రెస్‌(Congress) ఈ సారి మధుయాష్కీగౌడ్‌కు(Madhu Yashki Goud) టికెట్‌ కేటాయించింది. మధుయాష్కీ ఇక్కడి ప్రాంతవాసే కావడం గమనార్హం. నియోజకవర్గంలో గౌడ సామాజిక ఓటర్లు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌, అందులోనూ ఇది తమ సిట్టింగ్ సీటేనని ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ గంపెడాశలు పెట్టుకుంది. అధికారి పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది. మధుయాష్కీ విజయం నల్లేరుపై నడకేనని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఇది ఇలా ఉండగా కాంగ్రెస్‌లో అసంతృప్తి రాజుకుంది. పారాచూట్ నేతలకు టికెట్‌ ఎలా ఇస్తారని మల్‌రెడ్డి రాంరెడ్డి(Mal Reddy Ram Reddy) బాహాటంగానే విమర్శిస్తున్నారు. మల్‌రెడ్డి రాంరెడ్డి వర్గం మధుయాష్కీ ఎంతవరకు మద్దతు ఇస్తారా లేదా రెబల్‌గా పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఇదే నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన మరో నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి మధుయాష్కీ గెలుపు కోసం కృషి చేస్తాడా లేదా తాను కూడా రెబల్‌గా బరిలో ఉంటారో తెలియడం లేదు. మధుయాష్కీకి టికెట్‌ కేటాయింపుపై జక్కిడి ఇంకా పెదవి విప్పలేదు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రామ్మోహన్‌గౌడ్‌ వల్ల కాంగ్రెస్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుందనే చర్చనీయాంశంగా మారింది. గత రెండు ఎన్నికల్లో రామ్మోహన్‌గౌడ్‌ రెండో స్థానంలో ఉండడం, గణనీయంగా ఓట్లు సాధించడం, ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌కు చేరితే మధుయాష్కీకి కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి

అయితే మరోవైపు బీజేపీ కూడా ఎల్బీనగర్‌పై ఫోకస్‌ పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఉన్న 11 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. వరదలు, వరదల సాయం, రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో అధికారపార్టీపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ సమయంలోనే వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు అధికారపార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. బీఆర్‌ఎస్ అన్ని డివిజన్లలో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు షాక్‌ ఇవ్వబోతున్నామని బీజేపీ అంటోంది. ఎల్బీనగర్‌ నియోజకవర్గాన్ని ఈసారి కైవసం చేసుకుంటామని బీజేపీ చెప్తోంది. తీర్పు తెలియాలంటూ డిసెంబర్‌ 3వరకు చూడక తప్పదు.

Updated On 30 Oct 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story