Janagama Constituency : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. జనగామ గడ్డపై ఎగిరే జెండా ఎవరిది?
జనగామ(Janagama Constituency) రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సెగ్మెంట్లలో జనగామ ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని(Muthireddy Yadagiri Reddy) మార్చి..ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డికి జనగామ పగ్గాలు అప్పగించింది. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పోటీపడినా..అధిష్టానం పల్లాకే అవకాశం కల్పించింది. మరి..జనగామ ఓటర్లు పల్లాకు పట్టం కడతారా?
జనగామ(Janagama Constituency) రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సెగ్మెంట్లలో జనగామ ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని(Muthireddy Yadagiri Reddy) మార్చి..ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డికి జనగామ పగ్గాలు అప్పగించింది. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పోటీపడినా..అధిష్టానం పల్లాకే అవకాశం కల్పించింది. మరి..జనగామ ఓటర్లు పల్లాకు పట్టం కడతారా? లేదంటే విపక్షాలు ఛాన్స్ ఇస్తారా? ఓటర్ల మూడ్ ఎలా ఉంది? జనగామ నియోజకవర్గంలో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం- మా విశ్లేషణలో చూద్దాం.
జనగామ నియోజకవర్గానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో చేర్యాల స్థానంలో జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ గతంలో ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో ఉండేది. రాష్ట్రం వచ్చాక..జనగామ ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటి నుంచి బీఆర్ఎస్(BRS) పార్టీ హవా కొనసాగుతోంది. జనగామలో ఇప్పటి వరకు.. ఏడుసార్లు రెడ్లు, ఆరుసార్లు బిసి, రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్సీలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిదిసార్లు, సీపీఎం రెండు సార్లు, టీడీపీ ఒకసారి, బీఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి.
2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై 28490ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. అయితే ఆయనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు పెద్ద వివాదంగానే మారాయి. ఓ దశలో జిల్లా కలెక్టరే(Collector) ఆయనకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించాల్సి వచ్చింది. అయితే యాదగిరిరెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా..భారీ మెజార్టీతో రెండవసారి కూడా గెలిచారు. కానీ..ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. చెరువు భూములను కబ్జా చేశారని ప్రత్యర్థులతోపాటు స్వయంగా కూతురే ఆరోపణలు చేయడం, తండ్రిపైనే కేసులు పెట్టడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో అధిష్టానం ముత్తిరెడ్డిని పక్కన పెట్టి..జనగామ పగ్గాలను పల్లా చేతికి అప్పగించింది.
మొత్తానికి సీఎం కేసీఆర్(CM KCR) కోటరిలో ఒకరుగా చెప్పుకునే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఈసారి జనగామ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్య క్షుడిగా కూడా కొనసాగుతున్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ(TSRTC) ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం.. మిగతా నేతలందరినీ బుజ్జగించడంతో ప్రస్తుతం జనగామ అధికార పార్టీలో అసమ్మతి చల్లారిందనే చెప్పుకోవాలి. జనగామలో ఎలాంటి వర్గాలు లేవన్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. నియోజకవర్గంలో మిగిలిన పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేయాలని పల్లాకు సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొత్తానికి జనగామలో బీఆర్‌ఎస్ గెలుపు విషయంలో డౌటే లేదనే ధీమాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.
ఇక జనగామ నుంచి కాంగ్రెస్(congress) అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి(Kommuri Prathap Reddy) ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భగపండ్డారు.
తెలంగాణ ఆవిర్భావం బిల్లు ఆమోదం పొందాక పీసీసీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. తన సొంత నియోజకవర్గం జనగామలో ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని
కాంగ్రెస్ ఆశించగా, ఏకంగా పార్టీ అధ్య క్షుడే ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయారు. ఆ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని, పొన్నాల రాజకీయ జీవితాన్ని అప్రతిష్ట పాలుచేసిందనే చెప్పాలి. దీంతో ఈసారి పొన్నాలకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది. అయితే పొన్నాల లాంటి సీనియర్ నేతలకు టికెట్ కేటాయించడకుండా బీసీలను అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అధిష్టానంపై అనేక విమర్శలు చేసిన పొన్నాల.. గులాబీ పార్టీలో చేరిపోయారు.
ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి..నియోజకవర్గంలో గట్టిగానే తిరుగుతున్నారు. టికెట్ ప్రకటించడంతో ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. 2004, 2008 ఉప ఎన్నికల్లోనూ చేర్యాల నుంచి గెలుపొందిన ప్రతాపరెడ్డి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో జనగామ నుంచి పోటీ చేశారు. 2009లో బీఆర్‌ఎస్ తరపున, 2014లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ప్రతాప్ రెడ్డి… పొన్నాలపై కేవలం 236 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరగా… 2018 సంవత్సరంలో హస్తం గూటికి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడంతో ఈసారి ఎలాగైనా ఎలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి.
ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..అటు పొన్నాల లక్ష్మయ్య టికెట్ల వ్యవహారంతో వార్తల్లోకి వచ్చిన జనగామ నియోజకవరంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇటు అధికార బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఎవరికి వారే గెలుపుపూ ధీమాతో ఉన్నాయి. మరి..జనగామ ఓటర్ల మనసులో ఏముందో తెలియాలంటే..డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.