విలక్షణమైన తీర్పుకు వనపర్తి నియోజకవర్గం(Wanaparthy Constituency) ప్రత్యేకం. కాకలుతీరిన రాజకీయ నాయకులకు కేరాఫ్ అడ్రస్ ఈ సెగ్మెంట్. పాలమూరులో హాట్ సీటుగా చెప్పుకునే వనపర్తిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండో చాన్స్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‎రెడ్డి(Niranjan Reddy) చూస్తుంటే.. ఎలాగైనా వనపర్తిలో జెండా ఎగరేయాలని విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

విలక్షణమైన తీర్పుకు వనపర్తి నియోజకవర్గం(Wanaparthy Constituency) ప్రత్యేకం. కాకలుతీరిన రాజకీయ నాయకులకు కేరాఫ్ అడ్రస్ ఈ సెగ్మెంట్. పాలమూరులో హాట్ సీటుగా చెప్పుకునే వనపర్తిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండో చాన్స్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‎రెడ్డి(Niranjan Reddy) చూస్తుంటే.. ఎలాగైనా వనపర్తిలో జెండా ఎగరేయాలని విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి..సిట్టింగ్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా? లేదంటే.. విపక్షాలు పాగా వేస్తాయా? ఇంతకీ వనపర్తి కోటపై జెండా పాతేది ఎవరు? లోకల్‎గా ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

1952లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. వనపర్తి నియోజకవర్గం పరిధిలో 7 మండలాలున్నాయి. అవి.. పెబ్బేరు, వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపూర్, ఖిల్లా ఘనపూర్. ఈ సగ్మెంట్‎లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 31 వేలు. ఇక్కడ బీసీ ఓటర్లదే(BC Voters) ఆధిపత్యం..అందులోనూ యాదవులతోపాటు దళిత సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులోనూ అత్యథికంగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ(TDP) అభ్యర్థులు నాలుగుసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో తొలిసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగిరింది. తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్‎రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‎రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఉమ్మడి పాలమూరుజిల్లాలో వనపర్తి ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. వనపర్తిలో మరోసారి తన గెలుపు ఖాయమంటున్నారు నిరంజన్ రెడ్డి. ఈ నాలుగున్నరేళ్లలో తాను చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు వనపర్తి కోటాపై కన్నేసిన విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి..వనపర్తి సీటును తమ ఖాతాలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.

ఇక వనపర్తి కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా తూడి మేఘారెడ్డి(Thudi Medha Reddy) ఎన్నికల(Election) బరిలో దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి తొలుత టికెట్ ఖరారు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చివరికి మేఘారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. ఇక 2003లో టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన మేఘారెడ్డి.. 2015లో బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆరేళ్లపాటు పెద్దమందడి మండలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి పెద్దమందడి ఎంపీపీగా కొనసాగుతున్నారు. 2023 మార్చిలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచినా సమయంలోనే వనపర్తిలో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉండటంతో.. ఈసారి ఎలాగైనా వనపర్తిపై జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ(BJP) అభ్యర్థిగా అనుజ్ఞారెడ్డి(Anugna Reddy) పోటీపడుతున్నారు. ఈ స్థానం నుంచి తొలుత అశ్వత్థామరెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే చివరి జాబితాలో అశ్వత్థామరెడ్డి స్థానంలో అనుజ్ఞా రెడ్డి పరును ప్రకటించింది బీజేపీ హైకమాండ్. వనపర్తి స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో అభ్యర్థి మార్పు జరిగినట్టు సమాచారం. ఆర్టీసీ కార్మిక సంఘ నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా అశ్వత్థామరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం అనుజ్ఞారెడ్డి బీజేవైయం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి వనపర్తిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పని చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి అనుజ్ఞారెడ్డి.

మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం.. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మరి..వనపర్తి ఓటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డికి మరో అవకాశం ఇస్తారా? లేదంటే కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా? గులాబీ పార్టీ పాగా వేస్తుందా? వనపర్తి కోటపై.. ఈసారి జెండా ఎగరేసేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.

Updated On 14 Nov 2023 8:13 AM GMT
Ehatv

Ehatv

Next Story