ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో ‘ఇబ్రహీంపట్నం’(Ibrahimaptnam) ఒకటి. నగరానికి చేరువలో ఉన్న ఈనియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ చేజారి..కామ్రేడ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ టీడీపీ(TDP) కూడా తన హవా కొనసాగించింది. 2018 ఎన్నికల్లో పాగా వేసిన గులాబీ పార్టీ..మరోసారి జెండా ఎగరేసేందుకు సిద్ధమైంది. మరి ఇబ్రహీంపట్నంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారైనా కాంగ్రెస్‎ను విజయం వరిస్తుందా? ఇబ్రహీంపట్నం ఓటర్ల నాడి ఎలా ఉంది? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో ‘ఇబ్రహీంపట్నం’(Ibrahimptnam) ఒకటి. నగరానికి చేరువలో ఉన్న ఈనియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ చేజారి..కామ్రేడ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ టీడీపీ(TDP) కూడా తన హవా కొనసాగించింది. 2018 ఎన్నికల్లో పాగా వేసిన గులాబీ పార్టీ..మరోసారి జెండా ఎగరేసేందుకు సిద్ధమైంది. మరి ఇబ్రహీంపట్నంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారైనా కాంగ్రెస్‎ను విజయం వరిస్తుందా? ఇబ్రహీంపట్నం ఓటర్ల నాడి ఎలా ఉంది? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం(Ibrahimaptnam Constituency) భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. అవి.. ఇబ్రహీంపట్నం, హయత్‎నగర్, మంచాల్, యాచారం, అబ్దుల్లాపూర్‎మెట్. ఇక ఇక్కడ 2,21,478 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు సాధారణ, ఒకసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. 1957 నుంచి 1967 ఎన్నికల వరకు ఎంఎన్ లక్ష్మీ నర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ఉంది. కానీ.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో టీడీపీ ఈ సెగ్మెంట్‎లో పట్టు సాధించింది.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‎రెడ్డి(Manchireddy Kishan Reddy) మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తారనే పేరు సంపాదించుకున్నాడు మంచిరెడ్డి కిషన్‎రెడ్డి. రెండు సార్లు టీడీపీ తరుఫున గెలుపొందిన ఆయన..2018లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి..ఇబ్రహీంపట్నంలో మరోసారి గులాబీ జెండా ఎగరేయడం ఖయమంటున్నారు. ఇన్నాళ్లూ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు మంచిరెడ్డి కిషన్‎రెడ్డి.

ఇక కాంగ్రెస్ తరఫున మల్‎రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మల్‎రెడ్డి రంగారెడ్డికి టికెట్ నిరాకరించిన కాంగ్రెస్(Congress) హైకమాండ్.. క్యామ మల్లేశ్‎ను బరిలోకి దింపింది. దాంతో 2018 ఎన్నికల్లో మల్‎రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేసి.. రెండో స్థానంలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గట్టి పోటీనిచ్చి.. కేవలం 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి మంచిరెడ్డికి గెలుపు కత్తిమీద సామేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్‎కు కిందిస్థాయిలో మంచి పట్టు ఉంది. కానీ ఇక్కడి గ్రూపు రాజకీయాలతో ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటములు ఎదురవుతున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి పీసీసీ సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, సీనియర్‌ నాయకుడు ఈసీ శేఖర్‌గౌడ్‌ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ టిక్కట్ దక్కించుకున్న మల్ రెడ్డి రంగారెడ్డికి అసంతృప్తి నేతలు మర్రి నిరంజన్‌రెడ్డి, దండెం రాంరెడ్డిలతో పొసగడం లేదు. వీరిని బుజ్జగించి..దారికి తెచ్చుకోకపోతే గ్రాపు రాజకీయాలు మరోసారి కాంగ్రెస్ కొంప ముచుతాయని పార్టీ కేడర్ ఆందోళనగా ఉంది. మల్‌రెడ్డి రంగారెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 376 ఓట్లతో ఓడిపోయిన రంగారెడ్డి ఈసారి గెలుపు ఖాయమన్న అభిప్రాయంతో ఉన్నారు.

ఇబ్రహీంపట్నం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా ఈసారి నోముల దయానంద్ గౌడ్(Dayanand Goud) బరిలో దిగుతున్నారు. ఈ టికెట్ కోసం అశోక్ కుమార్ గౌడ్ పోటీపడినా.. బీజేపీ అధిష్టానం నోముల దయానంద్ గౌడ్ కే టికెట్ కేటాయించింది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మరింత బలంగా కనిపిస్తోంది. ఇక్కడ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉంది. గతంలో భువనగిరి ఎంపీగా విజయం సాధించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయనకు ఇక్కడ అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ ఓటు బ్యాంకును తన ఖాతావైపు మళ్లించుకోవాలని అనుకుంటున్నారు. ఇబ్రహీంపట్నంపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. ఈసారి ఏ మేరకు బీజేపీ కలిసొస్తుందన్నది వేచి చూడాలి.

ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ ఈసారి మూడు ప్రధాన పార్టీలు పూర్తి ఫోకస్ పెట్టాయి. అభివృద్ధి, సంక్షేమమే కాకుండా యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయమని మంచిరెడ్డి చెబుతున్నారు. పేద ప్రజలకు అండగా తను చేసిన పోరాటాలే గెలిపిస్తాయని మల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు నమ్మే అవకాశం లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెబుతుండగా.. పేదల వ్యతిరేకిగా ఉన్న మంచిరెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని మల్ రెడ్డి రంగారెడ్డి విశ్వాసంతో ఉన్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నా ఇబ్రహీంపట్నం ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 11 Nov 2023 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story