MEDCHAL CONSTITUENCY : కారు జోరు కొనసాగేనా.. మేడ్చల్ సెగ్మెంట్‌ని శాసించేదెవరు?
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతనలను అందించింది మేడ్చల్ గడ్డ. 1952లో మేడ్చల్ నియోజకవర్గం(MEDCHAL CONSTITUENCY) ఏర్పాటైంది. 1957లో మరో నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజకవర్గంగా చేశారు. ఇక్కడి నుంచి గెలుపొందిన నేతలు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చక్రం తిప్పారు. రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతనలను అందించింది మేడ్చల్ గడ్డ. 1952లో మేడ్చల్ నియోజకవర్గం(MEDCHAL CONSTITUENCY) ఏర్పాటైంది. 1957లో మరో నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజకవర్గంగా చేశారు. ఇక్కడి నుంచి గెలుపొందిన నేతలు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చక్రం తిప్పారు. రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. 1978లో ఇక్కడి నుంచి గెలిచిన మర్రిచెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు మర్రి చెన్నారెడ్డి. మీ నియోజకవర్గం.. మా విశ్లేషణ చూద్దాం...
ఎన్నికల కమిషన్(Election Commission) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం మెడ్చల్ నియోజకవర్గంలో 5,95,340 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,06,854 మంది, మహిళలు 2,88,486 మంది ఓటర్లుగా ఉన్నారు. ఓటర్ల నమోదుకు అవకాశం ఉన్నందున ఈ సంఖ్య ఆరులక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
1978లో మర్రి చెన్నారెడ్డిని(Chenna Reddy) గెలిపించి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని గెలిపించిన ప్రత్యేకతను ఈ నియోజకవర్గం దక్కించుకుంది. ఈ నియోజకవర్గం నుంచి దేవేందర్‌గౌడ్ వరుసగా 3 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు జరిగిన 13 ఎన్నికలలో కాంగ్రెస్(Congress) 6 సార్లు, టీడీపీ(TDP) 4 సార్లు, టీఆర్‌ఎస్ (BRS) రెండు సార్లు విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేందర్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి మంత్రులుగా పనిచేశారు.
2014లో తొలిసారి టీఆర్‌ఎస్ ఇక్కడ పాగా వేసింది. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మలిపెద్ది సుధీర్‌రెడ్డి(Malipeddi Sudhir Reddy) గెలుపొందారు. ఆతర్వాత 2018లో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్ చామకూర మల్లారెడ్డికి ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై(Kitchannagari Lakshmareddy) దాదాపు 88066 ఓట్ల భారీ మెజార్టీతో మల్లారెడ్డి గెలిచారు. ప్రస్తుతం మల్లారెడ్డి(Malla Reddy) మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ దక్కడంతో ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి దూసుకుపోతున్నారు. అసలు తనకు ప్రత్యర్థులే లేరంటున్న మల్లారెడ్డి, ఈసారీ తనదే విజయమని బల్లగుద్దీ మరీ చెప్తున్నాడు. సీఎం కేసీఆర్(CM KCR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, తన పని తనమే తనను గెలిపిస్తుందని మల్లారెడ్డి నమ్ముతున్నాడు. 'నవంబర్ 30న మన వేలుకు ఇంకు... డిసెంబర్ 3 తర్వాత స్టేటంతా పింకు' అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నాడు మల్లారెడ్డి. ప్రత్యర్థి పార్టీలో కూడా తాను టికెట్లు ఇప్పిస్తాని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇది ఇలాఉండగా ఈ సారి వజ్రేష్ యాదవ్ అలియాస్ జంగయ్య యాదవ్‌ను(Jangaiah Yadav) మేడ్చల్ బరిలో దింపింది. కాంగ్రెస్. సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి(Lakshmareddy) మహేశ్వరంలో సీటు సర్దుబాటు చేసింది. మంత్రి సబితను ఢీకొట్టాలంటే గట్టి లీడర్ కావాలని, ఎప్పటి నుంచో వీరి కుటుంబాల మధ్య వైరం ఉన్నందున కేఎల్‌ఆర్‌ను మహేశ్వరంలో నిలబెట్టామని కాంగ్రెస్ చెప్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడాచేరడంతో తమకు మరింత బలం చేకూరిందని కాంగ్రెస్ భావిస్తోంది. 2009లో PRP నుంచి వజ్రేష్ పోటీ చేసి వజ్రేష్ యాదవ్ ఓడిపోయాడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. రేవంత్‌తో పాటు వజ్రేష్ యాదవ్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ అనుచరుడిగా వజ్రేష్ యాదవ్ కొనసాగుతూ... మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కడంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి, యాంటీ ఇంకంబెన్స్ ఓటు తనకు కలిసి వస్తుందని వజ్రేష్ యాదవ్ భావిస్తున్నాడు. మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలతో ప్రజల్లో నెగెటివిటీ వచ్చిందని, మల్లారెడ్డి అరాచకాల వల్ల ప్రజలు విసిగిపోయారని, ఈసారి ప్రజలు తనకే అవకాశం ఇస్తారని వజ్రేష్ యాదవు చెప్తున్నాడు.
ఇక బీజేపీ విషయానికొస్తే... అర్బన్ ప్రాంతాల్లో తమకు అనుకూల పవనాలు ఉంటాయని, ఓటు బ్యాంక్ గణనీయంగా ఉంటుందని బీజేపీ చెప్తోంది. జనసేనతో పొత్తు కూడా తమకు కలిసొస్తుందని, టీడీపీ ఓటు బ్యాంక్ కూడా తమకే మద్దతుగా నిలుస్తుందనేది బీజేపీ నమ్మకం. ఈసారి మేడ్చల్‌లో గెలిచి చరిత్రను సృష్టించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.