నల్లగొండ(Nalgonda Assembly constituency ) రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి ములుపు తీసుకుంటాయో తెలియదు. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంచనా వేయడం కూడా కష్టమే. అయితే ఎన్నికల సమయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చే నల్లగొండ ఓటర్ల మూడ్ ఇప్పుడు ఎలా ఉంది? ఈసారి కూడ గెలుపు తమదేనంటోంది అధికార పార్టీ బీఆర్ఎస్. కర్నాటక ఎన్నికల తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ..నల్లగొండలో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది.

నల్లగొండ(Nalgonda Assembly constituency ) రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి ములుపు తీసుకుంటాయో తెలియదు. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంచనా వేయడం కూడా కష్టమే. అయితే ఎన్నికల సమయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చే నల్లగొండ ఓటర్ల మూడ్ ఇప్పుడు ఎలా ఉంది? ఈసారి కూడ గెలుపు తమదేనంటోంది అధికార పార్టీ బీఆర్ఎస్. కర్నాటక ఎన్నికల తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ..నల్లగొండలో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు తొలిసారి కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం వ్యూహాలకు పదునుపెడుతోంది. మరి ఈసారి నల్లగొండ నియోజకవర్గంలో కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

1952లో ద్విసభ నియోజకవర్గంగా ఉన్న నల్లగొండ 1957 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. నల్లగొండ సెగ్మెంట్‎లో తొలుత కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌కు(congress) కంచుకోటగా మారింది. నల్లగొండ నియోజవర్గం నుంచి 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, పీడీఎఫ్‎తో కలుపుకొని లెఫ్ట్ పార్టీలు నాలుగుసార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 1985లో ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాల్లో నల్లగొండ ఒకటి. రాష్ట్రం వచ్చాక తొలిసారి 2018 ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లోనే మొదటిసారి బీఆర్ఎస్(BRS) అభ్యర్థి
కంచర్ల భూపాల్‎రెడ్డి(Kancherla Bhupal Reddy) చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిపాలయ్యారు. అప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డిపై భారీ మెజార్టీతో సంచలన విజయం నమోదు చేశారు. భూపాల్‌ రెడ్డికి 98,792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి.

ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,24,458. అందులో పురుష ఓటర్లు 1,10,222 కాగా.. మహిళా ఓటర్లు 1,14,211 మంది ఉన్నారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్‌, మాడ్గులపల్లి మండలాలు ఉన్నాయి. నల్గొండ నియోజకవర్గం నుంచి 12 సార్లు రెడ్లు, రెండు సార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్‌, ఒకసారి ఎస్సీ, ఒకసారి కమ్మ సామాజికవర్గం నేత ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరు కాగా అది నిర్మాణంలో ఉంది. ఐటీ టవర్స్, పట్టణ వ్యాప్తంగా సుందరీకరణ పనులు, రహదారుల విస్తరణ, పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లియరెన్స్ వంటి సమస్యలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన కేసీఆర్.. ఆతర్వాత వాటిపై దృష్టి పెట్టారు. నల్లగొండ రూపు రేఖలు త్వరలోనే మారిపోతాయన్న అభిప్రాయం స్థానికులలో ఉంది. మరోసారి నల్లగొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారు. నల్లగొండ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడం..అభివృద్ధి పనులు కొనసాగడం..భూపాల్ రెడ్డికి అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

ఇక నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) బరిలో దిగుతున్నారు. నల్లగొండ నియోజవర్గం చాలాకాలంగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 ఏళ్లుగా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తనకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గాన్ని వెంకట్‎రెడ్డి పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం క్యాడర్‌లోకి బలంగా వెళ్ళింది. అయితే .. ఈసారి ఎలాగైనా నల్లగొండ నుంచి గెలిచి తీరాలనే పట్టుదలో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మరోవైపు నల్లగొండ నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా ఎం.శ్రీనివాస్ గౌడ్(M Srinivas Goud) ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యలపై పోరాటం చేస్తూనే..పార్టీ కేరడ్ ని యాక్టివ్ గా ఉంచారు అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్. ఇక్కడి నుంచి కొంత మంది ఆశావాహులు పోటీపడినా.. బీజేపీ హైకమాండ్ మాత్రం..బీసీ నేత శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించింది. ఎలాగైనా ఈసారి కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నాయి ఆ పార్టీ శ్రేణులు.

మొత్తానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా బీఆర్ఎస్(BRS) మరోసారి ఎన్నికల బరిలో దిగుతుండగా..విపక్షాలు కూడా అధికార పార్టీకి ధీటుగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నల్లగొండ సెగ్మెంట్ లో కారు పార్టీ మరోసారి సత్తా చాటుతుందా? విపక్షాలు పాగా వేస్తాయా? నల్లగొండ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందన్నది సర్వత్ర ఆసక్తిరేపుతోంది.

Updated On 12 Nov 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story