అడవుల జిల్లా ఆదిలాబాద్‎లో(Adilabad) నువ్వా..నేనా..అన్నట్టు ఉంది.. ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పాగా వేసేందుకు కారు పార్టీ,, కమలం, కాంగ్రెస్(Congress) కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఐదోసారి బరిలో దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న(Joggu Ramanna) జైత్రయాత్రకు బ్రేకులు వేస్తారా? ఆదిలాబాద్ సెగ్మెంట్లో గెలిచే బాద్ షా ఎవరు? తెల్ల బంగారం కోటలో ఎన్నికల విజయభేరి మోగించేది ఎవరనేది.. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఎన్నికల్లొచ్చాయంటే ప్రధాన పార్టీల చూపు హైదరాబాద్‎పైనే ఉంటుంది. ఇక్కడ పట్టు సాధించాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రజాతీర్పు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అంబర్‌పేట నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‎కే ఓటర్లు మరో అవకాశం ఇస్తారా? ఈసారి విపక్షాలు పాగా వేస్తాయా? అన్నది.. మీ నియోజకవర్గం-మా విశ్లేషణలో చూద్దాం.

2009లో నియోజకవర్గ పునర్విభజనలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం రద్దయిపోయి.. అంబర్‌పేట నియోజకవర్గం(Amberpet Constituency) ఏర్పడింది. అనేక రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువైన హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ 1978లో ఏర్పడిది. ఇక్కడి నుంచి గెలుపొంది అత్యున్నత పదవులు చేపట్టాలని భావించిన కొందరు ముఖ్యులు.. ఓటమి పాలవడం ఇక్కడి ప్రత్యేకత. రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో ఇద్దరు ముఖ్య నేతలు ఓడిపోగా.. బీజేపీ(BJP) సీనియర్ నేత ఆలే నరేంద్ర(Aale Narendra) ఆ రెండుసార్లు విజయం సాధించడం విశేషం. 1983లో శాసనసభకు ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే జి. నారాయణరావు గౌడ్‌(G Narayana Goud) ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీలో కీలక నేత పర్వతనేని ఉపేంద్ర ఇక్కడి నుంచి పోటీ చేసి.. బీజేపీ నేత ఆలే నరేంద్ర చేతిలో ఓటమి పొందారు.

ఇక 1992లో కాంగ్రెస్‌ శాసనసభ్యులు వి.హనుమంతరావు (V Hanumanth Rao)రాజ్యసభకు నామినేట్ కావడంతో ఇక్కడ మరోసారి ఉప ఎన్నిక ఆనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో మాజీ డిప్యూటీ సీఎం, సీఎం పదవి రేసులో ఉన్న సి.జగన్నాధరావు కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీ చేయగా.. అప్పటి బిజెపి అభ్యర్ది ఆలే నరేంద్ర చేతిలో ఓటమిపాలయ్యారు. వి.హన్మంతరావు కూడా మంత్రి పదవి నిర్వహించి, ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు మూడుసార్లు నామినేట్ అయ్యారు. రెండు ఉప ఎన్నికలతో సహా 9సార్లు ఎన్నికలు జరిగితే బిజెపి నాలుగుసార్లు, టీడీపీ మూడుసార్లు, జనతా పార్టీ, కాంగ్రెస్‌ ఐలు ఒక్కోసారి గెలుపొందాయి.

ప్రస్తుతం అంబర్‌పేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(Kaleru venkatesh) మరోసారి బరిలోకి దిగుతున్నారు.
అంబర్‌పేట నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా పోటీ చేసిన జి.కిషన్‌‎రెడ్డిని(Kishan Reddy) ఓడించడం సంచలనమే. వరసగా మూడుసార్లు హిమయత్‌‎నగర్‌, అంబర్‌పేట్‎ల నుంచి గెలుపొందిన కిషన్‌‎రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌ సభ ఎన్నికలలో కిషన్‌‎రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయ మంత్రి కావడం.. తదుపరి కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొందడం మరో ప్రత్యేకత. బీసి వర్గాలలోని వంజారా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాలేరు వెంకటేష్‌..2018లో తొలిసారి గెలిచారు. వెంకటేష్‌కు 61558 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిస్తాయన్న ధీమాతో ఉన్నారు కాలేరు వెంకటేష్.

అంబర్‎పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృష్ణా యాదవ్(Krishna Yadav) బరిలోకి దిగుతున్నారు. 24 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. చంద్రబాబు(Chandrababu) కేబినెట్‎లో మంత్రిగా పనిచేసిన కృష్ణా యాదవ్.. స్టాంపుల కుంభకోణంలో అరెస్టయి..జైలుకు వెళ్లడంతో రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికలకు ముందు కృష్ణా యాదవ్ టీడీపీలో తిరిగి చేరారు. అయితే పొత్తుల కారణంగా పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్‎లో చేరినా..సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల కాషాయ పార్టీలో చేరిన కృష్ణా యాదవ్ కు..బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. పాత హిమాయత్‌నగర్‌ సెగ్మెంట్లోని కొన్ని ప్రాంతాలు అంబర్‌పేటలో కలవడం..యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం కూడా కృష్ణయాదవ్‌ కు కలిసొచ్చే అంశం. మరి..మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు ఇవ్వన్నీ ఏ మేరకు కలిసి వస్తాయన్నది వేచి చూడాలి.

అంబర్ పేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిన్ రెడ్డి(Rohin Reddy) పోటీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్ గౌడ్, మోతే రోహిత్ పోటీపడినా..హైకమాండ్ మాత్రం రోహిన్ రెడ్డికి టికెట్ కేటాయించింది. మొదటి నుంచి స్థానికంగా పార్టీకోసం పని చేస్తున్న తమని కాదని, ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ రెండో జాబితాలో ఎక్కువగా ప్యారాచూట్‌ నేతలకే టికెట్‌ ఇవ్వడంతో స్థానిక నేతలు, క్యాడర్‌ అభ్యర్థులకు ఏ మాత్రం సహకరిస్తారనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

మొత్తానికి అంబర్ పేట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిదిసార్లు బీసీ నేతలు గెలుపొందగా ఒకసారి కమ్మ, మరోసారి రెడ్డి నేతలు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో అంబర్ పేట ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 12 Nov 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story