Ghanpur Station Assembly Constituency : స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈసారి ఎగిరే జెండా ఎవరిది?
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి(Ghanpur Station Assembly Constituency) ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత..ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎం యోగం దక్కింది. ఒకప్పుడు వీళ్లిద్దరూ రాజకీయ విరోధులు. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నేతలు. అయినా ఇద్దరి మధ్య వైరం ముదిరిందే తప్ప..తగ్గలేదు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి(Ghanpur Station Assembly Constituency) ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత..ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎం యోగం దక్కింది. ఒకప్పుడు వీళ్లిద్దరూ రాజకీయ విరోధులు. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నేతలు. అయినా ఇద్దరి మధ్య వైరం ముదిరిందే తప్ప..తగ్గలేదు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను(Rajaiah) కాదని.. సీనియర్ నేత కడియం శ్రీహరికి(Sri Hari) టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్(CM KCR). ఇక బీజేపీ(BJP) నుంచి డాక్టర్ గుండె విజయ రామారావు(Dr.Gunde Vijay Rama Rao), కాంగ్రెస్(Congress) తరఫున సింగాపురం ఇందిరా(Singapuram Indhira) బరిలో దిగుతున్నారు. మరి స్టేషన్ ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి? మీ నియోజకవర్గం.. మా విశ్లేషణలో చూద్దాం.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ(TDP)..రాష్ట్ర వచ్చాక గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్ 4 సార్లు విజయ సాధించాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..వరుసగా నాలుగు సార్లు గెలవగా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ తరఫున మూడుసార్లు గెలిచారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏడు మండలాలున్నాయి. అవి.. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు, జఫర్‌గఢ్. ఈ సెగ్మెంట్‌లో మొత్తం.. 2 లక్షల 34 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. లక్షా 35 వేల మంది దళిత ఓటర్లే. ఇందులోనూ..మాదిక సామాజికవర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. బీసీల ఓట్ బ్యాంక్ 60 వేలకు పైనే ఉంది. ఓసీలు 25 వేల మంది దాకా ఉన్నారు.
ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా రాజకీయాల్లో.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య(Dr.Thadikonda Rajaiah) తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి(Deputy CM) అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో మాత్రం మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతోపాటు బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు చేయడంతో అధిష్టానం టికెట్ నిరాకరించింది
ఇక స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మరోసారి సింగపురం ఇందిర బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో సింగపురం ఇందిర పోటీ చేసినా..కాంగ్రెస్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆఖరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యే. ఆయన కారెక్కిన తర్వాత స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ డీలాపడిపోయింది. రాజారపు ప్రతాప్.. పార్టీని వీడిన దగ్గర్నుంచి.. గ్రామీణ స్థాయిలో పార్టీ చిన్నాభిన్నమైంది. అయినా టికెట్ కోసం ఇక్కడి నుంచి చాలా మంది ఆశావహులు పోటీపడినా..కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం..మరోసారి సింగపురం ఇందిరకే అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా స్టేషన్ ఘన్‌పూర్ సెగ్మెంట్‌ను.. తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు..సింగపురం ఇందిరకు ఏమేరకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ తరఫున మాజీ మంత్రి గుండె విజయరామారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మాదాసు వెంకటేశ్, బొజ్జపల్లి ప్రదీప్(Bojjapalli Pradeep) టికెట్ కోసం పోటీపడినా.. విజయరామారావుకే బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. ఇటీవల కాలంలో కమలం పార్టీ గ్రాఫ్ కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున బీజేపీవైపు ఆకర్షితులవుతున్నారు. అయినా.. కాషాయం పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందనే ప్రచారం ఉంది. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారువి జయరామారావు. మరి స్టేషన్ ఘన్ పూర్ ఓటర్లు విజయరామారావుకు మరో అవకాశం ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది. వామపక్ష పార్టీలకు చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్పప్పటికీ.. పోటీ నామ మాత్రమే అంటున్నారు.
మొత్తానికి..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య విభేదాలు ఉండటంతో అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు సులువైనట్టేనని స్థానికంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ ఓటర్లు ఈసారి తప్పకుండా తమకే పట్టం కడతారన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏదేమైనా స్టేషన్ ఘన్‌ఫూర్‌లో ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది ఆసక్తికరంగా మారింది.