అడవుల జిల్లా ఆదిలాబాద్‎లో( Adilabad Assembly Constituency) నువ్వా..నేనా..అన్నట్టు ఉంది.. ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పాగా వేసేందుకు కారు పార్టీ,, కమలం(BJP), కాంగ్రెస్(Congress) కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఐదోసారి బరిలో దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న(Jogu ramanna) జైత్రయాత్రకు బ్రేకులు వేస్తారా? ఆదిలాబాద్ సెగ్మెంట్లో గెలిచే బాద్ షా ఎవరు? తెల్ల బంగారం కోటలో ఎన్నికల విజయభేరి మోగించేది ఎవరనేది.. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

అడవుల జిల్లా ఆదిలాబాద్‎లో( Adilabad Assembly Constituency) నువ్వా..నేనా..అన్నట్టు ఉంది.. ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ పాగా వేసేందుకు కారు పార్టీ,, కమలం(BJP), కాంగ్రెస్(Congress) కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఐదోసారి బరిలో దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న(Jogu ramanna) జైత్రయాత్రకు బ్రేకులు వేస్తారా? ఆదిలాబాద్ సెగ్మెంట్లో గెలిచే బాద్ షా ఎవరు? తెల్ల బంగారం కోటలో ఎన్నికల విజయభేరి మోగించేది ఎవరనేది.. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

తెలుగు అక్షర క్రమంలో ముందుండే నియోజకవర్గం ఆదిలాబాద్(Adilabad). ఓవైపు అపారమైన మాంగనీసు సిరులు, మరోవైపు సిమెంట్ నిల్వులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు..తెల్ల బంగారం పంటకు ఆసియాలోనే ప్రసిద్ది చెందిన ప్రాంతం కూడా. దిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 2 లక్షల 25 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో.. లక్షా 11 వేల మంది పురుషులు, లక్షా 14 వేల మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో.. ఐదు మండలాలున్నాయి. అవి.. ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, బేల, మావల, జైనథ్. అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లే కీలకం. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న సొంత మండలమైన జైనథ్‌లో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు 50 వేలు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేది మున్నూరుకాపు ఓటర్లే. అధికార బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్నే..మరోసారి బరిలోకి దిగుతున్నారు.

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా గెలిచిన సెగ్మెంట్ ఇది. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన జోగు రామన్న.. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కారెక్కేశారు. తర్వాత వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ ఉపఎన్నికతో కలిపి వరుసగా మూడు సార్లు గెలిచి.. ఆదిలాబాద్‌లో హ్యాట్రిక్ కొట్టారు. కేసీఆర్(KCR) తొలి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఇదే సీటులో.. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ కూడా జోగురామన్నదే.

ఆదిలాబాద్ సెగ్మెంట్లో ఒక సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కడం ఖాయమనే నమ్మకం అభ్యర్థుల్లో ఉంది. అలా ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో చాలా మంది మంత్రులుగా సేవలందించారు. రాజకీయంగా ఉన్నతస్థాయిలో పదవులు నిర్వహించారు. అయితే నాలుగుసార్లు గెలిచి..ఐదోసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న జోగురామన్న.. ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న విమర్శులు ఉన్నాయి. కానీ నియోజకవర్గంలో అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే ఐదోసారి తనను గెలిపిస్తాయనే ధీమాతో ఎమ్మెల్యే జోగురామన్న ఉన్నారు. తనకు మరోసారి అవకాశమిస్తే.. టెక్స్‌టైల్ పార్క్ తీసుకురావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇస్తున్నారు. అంతేకాదు.. చనాకా – కొరాటా బ్యారేజీ పనులు పూర్తవ్వాలంటే.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలను కోరుతున్నారు. తాను చేసిన అభివృద్ధే.. తనను ఐదోసారి విజయతీరాలకు చేరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న.

ఆదిలాబాద్ లో కమలం పార్టీ(BJP) గట్టి పోటీనిస్తూ వస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి..రెండో స్థానంలో నిలిచిన బీజేపీ నేత పాయల్ శంకర్(Payal Shankar)..మరోసారి బరిలోకి దిగుతున్నారు. తనకు అవకాశమిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటున్నారు పాయల్ శంకర్. ఇప్పటికే.. ఆదిలాబాద్‌లో మూతపడ్డ.. 110 జిన్నింగ్, ప్రెసింగ్ మిల్లులను తెరిపిస్తానని, ఎయిర్‌పోర్ట్, రైల్వే లైన్ తెచ్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడ్దారు పాయల్ శంకర్. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన తనకు.. ఈసారి కచ్చితంగా సానుభూతి వర్కవుట్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు. టికెట్ కోసం సుహసినిరెడ్డి పోటీపడినా బీజేపీ అధిష్టానం..మరోసారి పాయల్ శంకర్ వైపే మొగ్గు చూపింది.

ఇక ఆదిలాబాద్ నుంచి ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి(Srinivas Reddy) కాంగ్రెస్(Congress) హైకమాండ్ టికెట్ కేటాయించింది. ఇక్కడి నుంచి గండ్ర సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పోటీపడినప్పటికీ అధిష్టానం కంది శ్రీనివాస్ రెడ్డికే అవకాశం కల్పించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సుజాత..32 వేలకుపైగా ఓట్లు సాధించారు. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి..ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‎లో చేరారు. పారాచ్యూట్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని టికెట్ ఇవ్వొద్దంటూ గతంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే..పార్టీ కోసం పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి పార్టీ నాయకులు సహకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి మాత్రం..తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రూపులను పట్టించుకోవల్సిన అవసరం లేదంటున్నారు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి.

మొత్తానికి ఈసారి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్(congress) మధ్య ముక్కోణ పోరు తప్పేలా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగురామన్నకు.. బీజేపీ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చనే ప్రచారం ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక ఓట్లు ఉండటం కమలదళానికి కలిసొచ్చే అంశం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కారు పార్టీకి గట్టి పట్టు ఉంది. ఏదేమైనా గెలుపును ప్రభావితం చేసే.. మెజారిటీ మున్నూరు కాపులు తమ వెంటే ఉంటారనే ధీమాతో ఉన్నారు జోగు రామన్న. మరి వరుసగా ఐదోసారి గెలిచి..జోగురామన్న తనకు ఎదురు లేదనిపించుకుంటారా? పాయల్ శంకర్ కు ఒక్క చాన్స్ ఇస్తారా? మరి.. ఆదిలాబాద్ జనం ఎవరికి పట్టం కడతారనేదే ఆసక్తి రేపుతోంది.

Updated On 5 Nov 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story