ఎందరో ఉద్దండులకు రాజకీయ జీవితాన్ని అందించిన నియోజకవర్గం కల్వకుర్తి(Kalwakurthi Constituency). ఇక్కడ గెలిచినవారు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. దివంగత ఎన్టీఆర్‌ను(NTR) ఓడించిన చరిత్ర కల్వకుర్తి ఓటర్లది. ప్రతీ ఎన్నికల్లో పార్టీలు అనుకున్న దానికన్నా విలక్షణ తీర్పును అందిస్తున్న కల్వకుర్తిలో ఎన్నో ప్రత్యేకతలు... మీ నియోజకవర్గం.. మా విశ్లేషణ..!

ఎందరో ఉద్దండులకు రాజకీయ జీవితాన్ని అందించిన నియోజకవర్గం కల్వకుర్తి(Kalwakurthi Constituency). ఇక్కడ గెలిచినవారు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. దివంగత ఎన్టీఆర్‌ను(NTR) ఓడించిన చరిత్ర కల్వకుర్తి ఓటర్లది. ప్రతీ ఎన్నికల్లో పార్టీలు అనుకున్న దానికన్నా విలక్షణ తీర్పును అందిస్తున్న కల్వకుర్తిలో ఎన్నో ప్రత్యేకతలు... మీ నియోజకవర్గం.. మా విశ్లేషణ..!

కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రసుత్తం 2.30,650 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,17,393 మంది పురుషులు, 1,13,250 మంది స్త్రీలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు. 1952లో కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్, 3 సార్లు ఇండిపెండెంట్, 2 సార్లు జనతాదళ్‌, టీడీపీ రెండు సార్లు, బీఆర్‌ఎస్‌ ఒక సారి విజయాన్ని సాధించాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి, వెల్దండ, ఆమన్‌గల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌ మండలాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి(Vamsichand Reddy), 2018లో బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థి జైపాల్‌యాదవ్‌గా(Jaipalyadav) గెలుపొందారు. బీజేపీ నుంచి ఐదు సార్లు పోటీ చేసి ఆచారి ఓడిపోయాడు.

1989లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ(TDP) హవా కొనసాగినా... ఎన్టీఆర్‌ను ఇక్కడ ఓడించి కల్వకుర్తి చరిత్రలో నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చిత్తరంజన్‌దాస్‌(Chittaranjandas) ఎన్టీఆర్‌పై 3,568 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత జైపాల్‌రెడ్డి ఇక్కటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 ఉప ఎన్నికల్లో గెలిచి 1983 వరకు వరుసగా నాలుగు సార్లు జైపాల్‌రెడ్డి గెలుపొందారు.1984లో ఎంపీగా గెలిచిన జైపాల్‌రెడ్డి.. 2004, 2009లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1992లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1998లో ఇతనికి ఉత్తమ పార్లమెంటేరీయన్‌ అవార్డు లభించింది. రాష్ట్ర మంత్రులుగా 1962లో లట్టుపల్లి వెంకట్‌రెడ్డి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో, 1989లో చిత్తరంజన్‌దాస్‌ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు.

2014లో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కౌంటింగ్‌ ముగిసే సమయానికి వంశీచంద్‌కు 150 ఓట్ల ఆధిక్యత ఉడగా, ఒక ఈవీఎం మొరాయించింది. దాంతో ఆ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉన్న జూపల్లిలో రీపోలింగ్‌ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ రీపోలింగ్‌ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి ఆచారిపై వంశీచంద్‌రెడ్డి గెలుపొందారు.

ఇక 2023 విషయానికొస్తే బీఆర్ఎస్‌(BRS) నుంచి జైపాల్‌యాదవ్‌ పోటీ చేస్తున్నారు. జైపాల్‌ యాదవ్‌(Jaipal Yadav) రెండు సార్లు టీడీపీ నుంచి, ఒక సారి బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2018లో తన సమీప ప్రత్యర్థి ఆచారిపై 3,447 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.యాదవ సామాజికవర్గానికి చెందిన జైపాల్‌యాదవ్‌ సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు తనకే మద్దతు ఇస్తారని జైపాల్‌ యాదవ్‌ గట్టిగా నమ్ముతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్దే తనను గెలిపిస్తుందని జైపాల్‌యాదవ్‌ ధీమాతో ఉన్నారు. టికెట్‌ వచ్చి రెండు నెలల దాటడంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గమంతా చుట్టేశారు.వ్యతిరేకత ఉన్న చోట సర్దిచెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉప్పల వెంకటేష్‌ గుప్తా కూడా ఈ మధ్యే మంత్రి కేటీఆర్(KCR) సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మొదటి నుంచి బీఆర్‌ఎస్‌లో ఉన్న గోలి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది. వీరిద్దరి బలం కూడా తనకు కలిసి వస్తుందని జైపాల్‌యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ రాలేదన్న మనస్తాపంతో కసిరెడ్డి నారాయణరెడ్డి, జైపాల్‌యాదవ్‌తో విభేదాల కారణంగా మరో నేత బాలాజీ సింగ్‌ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌(Congress) విషయానికొస్తే.. ఇక్కడ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన కసిరెడ్డి నారాయణరెడ్డికి(Kasireddy narayana Reddy) టికెట్ వరించింది. రాత్రికి రాత్రే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి వర్గం మండిపడింది. సుంకిరెడ్డి వర్గం కసిరెడ్డికి మద్దతుగా పనిచేస్తుందో లేదోనన్న ఆయోమయం నెలకొంది. మరోవైపు కల్వకుర్తిలో రాహుల్‌ సభ తర్వాతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. కేసీఆర్‌ ప్రభుత్వంపై రాహుల్‌ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్‌కు కంచుకోట అని.. ఈ సారి కల్వకుర్తిపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని హస్తం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కసిరెడ్డి కూడా బలమైన అభ్యర్థి కావడంతో పోటీ గట్టిగానే ఉండనుంది.

బీజేపీకి(BJP) అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు బలంగా మారాయి. రెండు సార్లు స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఆచారి(Aachari), ఆ తర్వాత జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి బీజేపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ పాత నేతలు కొత్తవారిని చేర్చుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆచారి ఆశించిన స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని క్యాడర్‌కు కొంత అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీ గ్రూపు తగాదాలు, మోడీ చరిష్కా, ఆచారిపై సానుభూతి తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది.మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్‌లో పోరు రసవత్తరంగా మారనున్నది.

Updated On 2 Nov 2023 8:08 AM GMT
Ehatv

Ehatv

Next Story