హైదరాబాద్‎లోనే(Hyderabad) ఖైరతాబాద్(Khairathabad) అసెంబ్లీ సెగ్మెంట్‎కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఖైరతాబాద్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది బడా గణేశ్. రాజకీయమైతే..కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్(PJR) కళ్ల ముందు కనిపిస్తారు. ఎన్నికళ వేళ ఖైరతాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ గెలిస్తే మంత్రులవుతారన్న సెంటిమెంట్ కూడా ఉంది.

హైదరాబాద్‎లోనే(Hyderabad) ఖైరతాబాద్(Khairathabad) అసెంబ్లీ సెగ్మెంట్‎కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఖైరతాబాద్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది బడా గణేశ్. రాజకీయమైతే..కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్(PJR) కళ్ల ముందు కనిపిస్తారు. ఎన్నికళ వేళ ఖైరతాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ గెలిస్తే మంత్రులవుతారన్న సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో గెలిచినవారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే. మరోసారి గెలుపొంది.. బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? ఒకప్పటి కాంగ్రెస్(Congress) కంచుకోటలో..ఈసారి ఆ పార్టీ పాగా వేస్తుందా? ఖైరతాబాద్‎ సెగ్మెంట్‎లో ఎగరబోయే జెండా ఎవరిది? ముక్కోణపోరులో సత్తాచాటేదెవరు? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఉమ్మడి ఏపీలో ఖైరతాబాద్‎కు అతి పెద్ద నియోజకవర్గంగా పేరుండేది. 2009లో జరిగిన పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్‌ సెగ్మెంట్ ఏర్పడింది. ఈ నియోజకవర్గం పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పి.జనార్దన్‎రెడ్డి(P Janardhan Reddy). అంతా పిలుచుకునే పేరు.. పీజేఆర్. 1985 నుంచి మొదలుపెడితే.. 1989, 1994, 2004 వరకు ఖైరతాబాద్‌ నుంచి వరుసగా గెలిచిన నేత ఆయన. 1990 నుంచి 1993 వరకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పీజేఆర్ అంటే మాస్ లీడర్. జనం తయారుచేసుకున్న నాయకుడు. పీజేఆర్ సమయంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. పీజేఆర్ అంటే ఖైరతాబాద్.. ఖైరతాబాద్ అంటే పీజేఆర్ అనే స్థాయిలో రాజకీయం నడిచింది. అలాంటిది 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గులాబీ జెండా ఎగిరింది.

నగరం నడిబొడ్డున ఉండే ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్‌కు గుండెకాయ లాంటిది. ఈ సెగ్మెంట్‎లో మంత్రులు, ప్రముఖులు, ఉద్యోగులు, సినీ ప్రముఖులతోపాటు బీసీలు, మధ్యతరగతి వర్గాలు, మురికివాడల ప్రజలు నాయకుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల కాలనీలు, సెటిలర్లు, సినీ వర్గాలు, మురికివాడలను టార్గెట్‌ చేసుకుని నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇలా అన్ని రకాల ప్రజలు నివసించే ఏకైక నియోజకవర్గం ఖైరతాబాద్. అంతేకాదు సచివాలయం మొదలుకొని.. శాసనాలు చేసే అసెంబ్లీ, చట్టాలు ఆమోదం పొందే రాజ్‌భవనన్, కళలకు పట్టం కట్టే రవీంద్రభారతి వరకు..అన్ని ఈ నియోజకవర్గంలో భాగంగానే ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Dhanam Nagendher) మరోసారి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం దానం పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉంది? ఖైరతాబాద్ ప్రజలు మరోసారి పట్టం కడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్‎కు కంచుకోట. ప్రస్తుతం పీజేఆర్ కూతురు విజయారెడ్డి(Vijaya Reddy) ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్(BRS) నుంచి టికెట్ ఆశించినా.. సిట్టింగ్‎లకే టికెట్ కేటాయించడంతో విజయారెడ్డి కాంగ్రెస్‎లో(Congress) చేరిపోయారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. పీజేఆర్ తర్వాత..బలమైన కాంగ్రెస్ నేతగా ఉన్న దానం కూడా కారెక్కేయడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడిపోయింది. పీజేఆర్ వారసురాలిగా ఆయన కూతురు విజయారెడ్డి.. ఇప్పుడు చేతి గుర్తుపై పోటీకి సై అంటున్నారు. తన తండ్రి పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులు, పేదలకు చేసిన సంక్షేమ పనులే.. తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు విజయారెడ్డి.

ఇక బీజేపీ(BJP) తరఫున బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి(Chinthala Ramchandher) పోటీపడుతున్నారు. 2014లో ఇక్కడి నుంచి చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఈ సెగ్మెంట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక్కడి నుంచి చింతల మరోసారి బరిలోకి
దిగుతున్నారు. ఒకరిద్దరు నేతలు టికెట్ కోసం పోటీపడినా..బీజేపీ అధిష్టానం మాత్రం..సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డికే అవకాశం కల్పించింది. గతంలో..తాను చేసిన అభివృద్ధి పనులను జనం మరిచిపోలేదని.. అవే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు చింతల రామచంద్రారెడ్డి.

ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఎంత పాపులారిటీ ఉందో.. అదే స్థాయిలో సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కిలోమీటర్లకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింక్ రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు దక్కక.. బస్తీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఇక.. డ్రైనేజీ సమస్య ఉండనే ఉంది. ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే దుర్వాసన, వ్యర్థాలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గతంలో ప్రకటించిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి. ఇలా అనేక సమస్యలకు నెలవుగా మారింది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఈ సమస్యలన్నీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సవాల్‎గా మారనున్నాయి.

మొత్తానికి ఖైరతాబాద్‎ సెగ్మెంట్లో ఈసారి ముక్కోణ పోరు తప్పేలా లేదు. ఈ నియోజకవర్గంలో అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ, పార్టీల గెలుపోటములను నిర్ణయించేది మాత్రం బస్తీ ప్రజలే. చదువుకున్నవాళ్లు, యువత, మొదటిసారి ఓటు హక్కు వచ్చినవారిపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. బస్తీల్లో ఇప్పటికీ పీజేఆర్‌ని అభిమానించే ఓటర్లు ఎక్కువగానే ఉండటంతో వారంతా ఈసారి తనకే అండగా ఉంటారన్న ధీమాతో ఉన్నారు పీజేఆర్ కూతురు విజయారెడ్డి. బీఆర్ఎస్ మాత్రం..అభివృద్ధి, సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. మరి ఖైరతాబాద్ ఓటర్లను ఆకర్షించి.. గెలిచేదెవరన్నది ఆసక్తిగా మారింది.

Updated On 3 Nov 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story