హైద‌రాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం మొఘల్‌పురా వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ రోడ్డు మధ్యలో పేలడంతో ఒక పోలీసు సహా పది మంది గాయపడ్డారు

హైద‌రాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం మొఘల్‌పురా వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ రోడ్డు మధ్యలో పేలడంతో ఒక పోలీసు సహా పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొఘల్‌పురాలోని బీబీ బజార్ రోడ్డులో చోటుచేసుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఓ వ్యక్తి నడుపుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై నుంచి దూకి తనను తాను రక్షించుకోగా.. అరడజను మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పైపుతో నీరు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అయితే అనూహ్యంగా మోటారు సైకిల్ ఒక్కసారిగా పేలడంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న వ్యక్తులు, పక్కనే ఉన్న మరికొందరికి మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన‌ వీడియోలో పోలీసుతోపాటు ఇతరులను చూడవచ్చు, వారిలో ఒకరు పైపు నుండి నీటితో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ స‌మ‌యంలో అకస్మాత్తుగా బైక్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఘటన జరిగిన వెంటనే మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం మొఘల్‌పురాలోని ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రికి తరలించారు.

Updated On 12 May 2024 10:22 AM GMT
Yagnik

Yagnik

Next Story