తెలంగాణ(Telangana)లో పెట్రోల్ బంకులు(Petrol Bunks) మూతబడుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇప్పటికే సగానికి సగం బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ట్రక్కు డ్రైవర్లు నిరసనకు దిగడం, సమ్మె చేయడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. ఇది తెలుసుకుని వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు పోటెత్తుతున్నారు.
తెలంగాణ(Telangana)లో పెట్రోల్ బంకులు(Petrol Bunks) మూతబడుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇప్పటికే సగానికి సగం బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ట్రక్కు డ్రైవర్లు నిరసనకు దిగడం, సమ్మె చేయడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. ఇది తెలుసుకుని వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు పోటెత్తుతున్నారు. బంకుల దగ్గర చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు పోటెత్తారు. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు.