తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా హైదరాబాద్(Hyderabad)లోని కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) నివాసమైన జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అచిరకాలంలోనే ప్రజల మనసును గెల్చుకుంది. కొన్ని ఉత్థానపతనాలను చవి చూసినప్పటికీ అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను మాత్రం వీడలేదు. కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ఈ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతు ఎంతగానో ఉపయోగపడింది.
తెలంగాణ(Telangana) రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా హైదరాబాద్(Hyderabad)లోని కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) నివాసమైన జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అచిరకాలంలోనే ప్రజల మనసును గెల్చుకుంది. కొన్ని ఉత్థానపతనాలను చవి చూసినప్పటికీ అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను మాత్రం వీడలేదు. కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ఈ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతు ఎంతగానో ఉపయోగపడింది. సమైక్యాంధ్ర పాలనలో ఎన్నో వేదనలు, కష్టాలు అనుభవించిన తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. అసంతృప్తితో రగిలిపోతున్న జనాలు అక్కున చేర్చుకున్నారు.
నిజానికి టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచి తెలంగాణ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. 1995లో చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో దోపిడి మొదలయ్యింది. వివక్షా పెరిగింది. ఆర్ధిక సరళీకృత విధానాలు, సంస్కరణల పేరు చెప్పి తెలంగాణలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసేశారు. లాభాలలో ఉన్న నిజాం షుగర్స్ పరిశ్రమలను ముక్కలు చెక్కలు చేసి ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు చాలా తక్కువ ధరకు అమ్మేశారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అదే సమయంలో నక్సలైట్ల అణచివేత అంటూ తెలంగాణ ప్రాంతం అంతటా నిర్బంధం అమలు చేశారు. ఎన్‌కౌంటర్ల పేరుతో వందలమంది యువకులను పొట్టన పెట్టుకున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ఉద్యోగాలలో కూడా తెలంగాణవారికి అన్యాయం జరిగింది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బావుల్లో నీరు లేకపోవడం .. ఇవన్నీ రైతులను కడగండ్ల పాలు చేశాయి. తీసుకున్న అప్పులు తీర్చలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు వ్యవసాయం భారంగా మారి అవస్థలు పడుతుంటే చంద్రబాబు కరెంట్ ఛార్జిలు పెంచాడు. కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తొమ్మిది వామపక్ష సంఘాలు చేపట్టిన ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
ఈ సంఘటనల్నీ కేసీఆర్(KCR)ను కలచివేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక పరిష్కారమని భావించరు. కేసీఆర్‌కు తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు అండగా నిలిచారు. అందరితో చర్చలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించాలని సంకల్పించారు. తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా ఉన్న జలదృశ్యంను టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చారు కొండా లక్ష్మణ్ బాపూజీ. 2001, ఏర్పిల్ 27న జలదృశ్యంలో టీఆర్‌ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ పది జిల్లాల పటంతో కూడిన గులాబీ రంగు జెండా రెపరెపలాడసాగింది. పార్టీ ఏర్పాటైన తొమ్మిది రోజుల్లోపే 19 లక్షల మంది సభ్యులుగా చేరడం గమనార్హం. 2001, మే 17న కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన సభ బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జూన్ 1న మహబూబ్‌నగర్‌లో, రెండున నల్లగొండలో, నాలుగో తేదీన నిజామాబాద్‌లో, అయిదో తేదీన నిర్మల్‌లో, 21న వరంగల్‌లో భారీ సభలను నిర్వహించింది. అన్ని సభలూ ఊహించినదానికంటే సక్సెసయ్యాయి. 2001 జులై 12, 15, 17 తేదీలలో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఇది తట్టుకోలేని చంద్రబాబు జలదృశ్యం భవనాన్ని నేలమట్టం చేశారు. 2001 ఆగస్టు 18న టీఆర్‌ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయ్యింది. 2001, సెప్టెంమర్ 22న కేసీఆర్ రాజీనామా చేసిన సిద్ధిపేట అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చింది. చంద్రబాబు ఎన్ని మాయలు చేసినా కేసీఆర్ విజయాన్ని ఆపలేకపోయారు. ఏ తెలంగాణ పదాన్ని ఉచ్చరించకూడదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారో అదే అసెంబ్లీలో కేసీఆర్ తెలంగాణ పదాన్ని సగర్వంగా నిలిపారు. 2001, నవంబర్ 17న ఖమ్మం జిల్లాలో ప్రజాగర్జన సభ, 2002, మార్చి 27న వికారాబాద్‌లో శంఖారావం సభలు విజయవంతమయ్యాయి. ప్రజలలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. తెలంగాణకు ఊపు వచ్చింది. ఇక ఆ తర్వాత అంతా చరిత్రనే! ఇప్పుడు అదే టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెంది దేశం మొత్తానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. టీఆర్‌ఎస్ అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికి తలమానికంగా నిలిచాయి.