What's in a name? అని అన్నాడు విలియమ్‌ షేక్‌స్పియర్‌(William Shakespeare). అనగా నేములో నేముందని అర్థం! ఆ పెద్ద మనిషి తెలియక అన్నాడేమో కానీ అంతా పేరులోనే ఉంది! అందుకే కదా ఇప్పుడు న్యూమరాలజీకి అంత డిమాండ్‌! పేరు బాగుంటే ఆటోమాటిక్‌గా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయన్నది చాలా మంది నమ్మకం. సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలని అడుగుపెట్టి, ఆ ప్రయత్నంలో అలసిపోయి చివరకు పేరు మార్చుకుని క్లిక్‌ అయిన వారు ఎందరో! అమిర్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్లు కూడా పేరు మార్చుకున్నారు.

What's in a name? అని అన్నాడు విలియమ్‌ షేక్‌స్పియర్‌(William Shakespeare). అనగా నేములో నేముందని అర్థం! ఆ పెద్ద మనిషి తెలియక అన్నాడేమో కానీ అంతా పేరులోనే ఉంది! అందుకే కదా ఇప్పుడు న్యూమరాలజీకి అంత డిమాండ్‌! పేరు బాగుంటే ఆటోమాటిక్‌గా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయన్నది చాలా మంది నమ్మకం. సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలని అడుగుపెట్టి, ఆ ప్రయత్నంలో అలసిపోయి చివరకు పేరు మార్చుకుని క్లిక్‌ అయిన వారు ఎందరో! అమిర్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్లు కూడా పేరు మార్చుకున్నారు. యడియూరప్ప వంటి రాజకీయ నాయకులు కూడా ఎందరో చెప్పారని పేరులోని అక్షరాలను సవరించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయనకు సక్సెస్‌ రాలేదనుకోండి! ఈ పేరు గొడవ ఇప్పుడెందుకు అంటే, బీఆర్‌ఎస్‌(BRS) కష్టాలు చూస్తే చెప్పాలనిపించింది. చక్కగా టీఆర్‌ఎస్‌గా(TRS) ఉన్న పార్టీ పేరును పెద్ద సారు అనవసరంగా బీఆర్‌ఎస్‌గా మార్చారన్నది చాలా మంది కంప్లయింట్‌! పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారినప్పట్నుంచి ఏదీ సవ్యంగా జరగడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ పదం ఉండేసరికి అప్పట్లో తెలంగాణవాసులు పార్టీని ఓన్‌ చేసుకున్నారు. ఆ సెంటిమెంట్‌ బాగా పని చేసింది. కేసీఆర్‌ తెలంగాణకు పరిమితమైతే బాగుండేది కానీ ఆయన దృష్టి దేశం మీద పడింది. ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను దేశమంతటా విస్తరింపచేయాలన్న అత్యాశతో పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. అక్కడ్నుంచి ఎదురుదెబ్బలు తగడం మొదలయ్యింది. మేడిగడ్డలో పిల్లర్‌ కూలింది. కాళేశ్వరంపై ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపాలైంది. అధికారం కోల్పోయినా కేసీఆర్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే కేసీఆర్‌ కాలు విరిగింది. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ఇదే సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు రోజుకో ఆరోపణ చేస్తోంది. కాళేశ్వరంపై కత్తులు నూరుతోంది. అవినీతిపై విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు తలో దారి చూసుకుంటున్నారు. చాలా మంది అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇంతకాలం మాట కూడా మాట్లాడని నేతలంతా కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని కేసీఆర్‌ బయటకు చెబుతున్నారు కానీ ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ఇలా జరుగుతుందని కేసీఆర్‌ కూడా ఊహించి ఉండరు. అన్నట్టు కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువే! న్యూమరాలజీని నమ్ముతారో లేదో తెలియదు కానీ పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారిస్తే చూడాలని అనుకుంటున్నారు నేతలు, కార్యకర్తలు. బీఆర్‌ఎస్‌ ను టీఆర్‌ఎస్‌గా మార్చడం పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పటికైనా కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల జోలికి వెళ్లకుండా తెలంగాణకు పరిమితమైతే బాగుంటుంది. ఇది మెజారిటీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కోరిక!

Updated On 16 March 2024 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story