వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను తెలంగాణ స్టేట్ (TS) నుంచి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ (TG)గా మార్చాలని నిర్ణయించింది కదా! ఇప్పుడు టీఎస్ నంబర్ ప్లేట్‌ను(Number plate) టీజీగా మార్చుకోవాల్సిందేనా? మార్చుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
వాహనాల(Vehcile) రిజిస్ట్రేషన్ కోడ్‌ను తెలంగాణ స్టేట్ (TS) నుంచి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ (TG)గా మార్చాలని నిర్ణయించింది కదా! ఇప్పుడు టీఎస్ నంబర్ ప్లేట్‌ను(Number plate) టీజీగా మార్చుకోవాల్సిందేనా? మార్చుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. ఈ అనుమానాలను రవాణాశాఖ అధికారులు నివృత్తి చేశారు. ప్రస్తుతానికి టీఎస్ నంబర్‌ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు మాత్రమే అది వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అప్పటి వరకు ఎవరూ నంబర్ ప్లేట్లను తమంత తాముగా టీజీగా మార్చుకోవద్దని రవాణాశాఖ అధికారులు కోరారు.