హైదరాబాద్‌ బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్‌ బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సిరాజ్‌ (Siraj)అనే వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తండ్రి తన తమ్ముడిని చంపడాన్ని చూసి పెద్ద కొడుకు పరారయ్యాడు. తండ్రి చేస్తున్న దాష్టీకంపై బిగ్గరగా కేకలు వేస్తూ పరుగెత్తాడు. సమాచారం అందుకున్న బేగంబజార్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతడు మహ్మద్ సిరాజ్ అలీ(mohammed siraj ali), భార్య హేలియ(Heliya), కుమారుడు హైజాన్‌(Hyjan)లుగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు సిరాజ్ రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఉత్తరప్రదేశ్‌(UP) నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ehatv

ehatv

Next Story