బండేసుకుని బయటకు వెళితే ట్రాఫిక్‌ రూల్స్‌(Traffic rules) పాటించండి. మునుపటిలా కాదు.

బండేసుకుని బయటకు వెళితే ట్రాఫిక్‌ రూల్స్‌(Traffic rules) పాటించండి. మునుపటిలా కాదు. ఇప్పుడు జరిమానాలు(charges) బాగా పెరిగాయి. అంచేత వాహనదార్లు అప్రమత్తంగా ఉండాలి. ఇంతకు ముందు సాధారణ నేరానికి జరిమానా కింద వంద రూపాయలు వసూలు చేసేవారు. ఇకపై అయిదు వందలు కట్టాల్సి వుంటుంది. సిగ్నల్స్‌(Signal) దగ్గర రెడ్‌లైట్‌(red light area) పడినా వెళ్లిపోయామనుకోండి.. వంద రూపాయలు ఫైన్‌ కట్టేవాళ్లం. ఇప్పుడు అయిదు వందలు ఫైన్‌. అథారిటీ ఆదేశాలను ధిక్కరించినందుకు ఇంతకు మునుపు 500 రూపాయల జరిమానా ఉంటే ఇప్పుడు రెండు వేలరూపాయలు అయ్యింది. లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే గతంలో 500 రూపాయలు ఫైన్‌ కట్టించుకునేవారు. ఇప్పుడు అయిదు వేల రూపాయలు కట్టాలి. అతి వేగానికి నాలుగు వందల రూపాయలు ఇంతకు ముందు ఉండింది. ఇప్పుడది వెయ్యి రూపాయలకు పెరిగింది. రాష్‌ డ్రైవింగ్‌కు మునుపు వెయ్యి రూపాయల జరిమానా ఉండేది. ఇప్పుడు అది అయిదు వేల రూపాయలు అయ్యింది. మద్యం తాగి బండి డ్రైవ్‌ చేస్తే గతంలో రెండు వేల రూపాయలు ఫైన్‌ వేసేవారు. ఇప్పుడది పది వేల రూపాయలు అయ్యింది. రోడ్ల మీద స్పీడ్‌గా వెళుతూ, రేసింగ్‌లు చేస్తే 500 రూపాయల జరిమానా పడేది. ఇప్పుడది అయిదు వేల రూపాయలు అయ్యింది. ఇంతకు ముందు హెల్మెట్‌ పెట్టుకోకపోతే వంద రూపాయల ఫైన్‌ వేసేవారు. ఇప్పుడు వెయ్యి రూపాయల ఫైనల్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తారు. సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే గతంలో వంద రూపాలయ ఫైన్‌ ఉండింది. ఇప్పుడది వెయ్యి రూపాయలయ్యింది. అత్యవసర వాహనాలను అడ్డగిస్తే ఇంతకు ముందు నిర్దిష్ట జరిమానా అంటూ ఉండింది కాదు. ఇప్పుడు మాత్రం పది వేల రూపాయలు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. టూ వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌ చేస్తే 12 వందల రూపాయలు ఫైన్‌ కట్టాలి. అలాగే డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మొబైల్‌ ఫోన్లను అసలు ఉపయోగించకూడదు. టూ వీలర్‌ వారే కాదు, ఫోర్‌ వీలర్‌లో వెళుతున్నా సెల్‌ ఫోన్‌లను వాడకూడదు. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్ ఉంటే ఇంతకు ముందు వంద రూపాయలతో సరిపెట్టేవారు. ఇప్పుడు రెండు వేల రూపాయల ఫైన్‌ ప్లస్‌ మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు. ఇన్సూరెన్స్‌ లేకుండా బండి నడిపిస్తే గతంలో వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు. ఇప్పుడు అది 2000 రూపాయాలు అయ్యింది. అంచేత ట్రాఫిక్స్‌ రూల్స్‌ను ఉల్లంఘించకుండా ఉండండి..

Eha Tv

Eha Tv

Next Story