హైదరాబాద్‌(Hyderabad) నడిబొట్టున డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌(Dr. B.R. Ambedkar) విగ్రహావిష్కరణకు సమయం ఆసన్నమయ్యింది. దేశంలోనే ఎత్తయిన 126 అడుగుల విగ్రహాన్ని మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ మధ్యం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నెక్‌లెస్‌ రోడ్డు, ఖైరతాబాద్‌, లకిడీకాపూల్‌, తెలుగుతల్లి జంక్షన్‌ రహదారులలో ట్రాఫిక్‌ ఆంక్షలు(Traffic Allert) విధించారు.

హైదరాబాద్‌(Hyderabad) నడిబొట్టున డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌(Dr. B.R. Ambedkar) విగ్రహావిష్కరణకు సమయం ఆసన్నమయ్యింది. దేశంలోనే ఎత్తయిన 126 అడుగుల విగ్రహాన్ని మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ మధ్యం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నెక్‌లెస్‌ రోడ్డు, ఖైరతాబాద్‌, లకిడీకాపూల్‌, తెలుగుతల్లి జంక్షన్‌ రహదారులలో ట్రాఫిక్‌ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. నెక్‌లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌వైపు వాహనాలకు అనుమతి లేదు. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్‌లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లిస్తున్నారు. సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలిస్తున్నారు. లకిడీకపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లకిడీకపూల్ వైపుకు మళ్లించారు. మింట్ కౌంపౌండ్, నెక్‌లెస్‌ రోటరీ మార్గాలను మూసివేశారు. అలాగే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులను మూసేశారు. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీకి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలంటున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు చెబుతున్నారు.

Updated On 14 April 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story