ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య బీజేపీ

ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ (బేగంపేట్) విమానాశ్రయం - షాపర్స్ స్టాప్ - హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ - బేగంపేట్ ఫ్లైఓవర్ - గ్రీన్ ల్యాండ్స్ - మోనప్ప ఐలాండ్ జంక్షన్ - యశోద హాస్పిటల్ - రాజ్ భవన్ - వివి విగ్రహం - ఖైరతాబాద్ ఫ్లైఓవర్ - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగు తల్లి జంక్షన్ - ఇక్బాల్ మినార్ - రవీంద్ర భారతి - హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వద్ద డైవర్షన్స్, ఆంక్షలు ఉండనున్నాయి. ఎల్‌బి స్టేడియం - నాంపల్లి - బషీర్‌బాగ్ - బిజెఆర్ విగ్రహం - ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ - జిపిఓ అబిద్ రోడ్ సర్కిల్ - నాంపల్లి స్టేషన్ రోడ్ - ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ - సుజాత స్కూల్ జంక్షన్ - కెఎల్‌కె బిల్డింగ్ - లిబర్టీ - హిమాయత్‌నగర్ - స్టేట్ అసెంబ్లీ - MJ మార్కెట్- హైదర్‌గూడ వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే, సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ – 9010203626ను సంప్రదించాలని సూచించారు.

Updated On 9 May 2024 10:15 PM GMT
Yagnik

Yagnik

Next Story