తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఒక హెచ్చరిక జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఒక హెచ్చరిక జారీ చేశారు. గన్‌పార్క్, నాంపల్లి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్‌లలో ఆంక్షలు అమల్లో ఉండనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నాంపల్లి టి జంక్షన్‌ నుంచి రవీంద్ర భారతి వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద పీజేఆర్‌ విగ్రహం వైపు మళ్లిస్తారు.

VVIP కాన్వాయ్.. CTO జంక్షన్, ప్లాజా జంక్షన్ మీదుగా వెళ్లేక్ర‌మంలో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. ఉదయం 10 నుండి 11 గంటల మధ్య కాన్వాయ్ వెల్లిన‌ తర్వాత వాహ‌న‌దారుల‌ను ముందుకు అనుమతించనున్నారు.

రాత్రి 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.. రాణిగంజ్, ఆర్‌పి రోడ్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. కర్బలా జంక్షన్ వద్ద బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్, లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లడానికి ట్రాఫిక్ అనుమతించబడదు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, బైబిల్ హౌస్, కర్బలా జంక్షన్ వైపు వెళ్లాలి.

ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు

భారీ ట్రాఫిక్ రద్దీ ఉన్న‌ కింది జంక్షన్‌ల ద్వారా ప్ర‌యాణించే వాహ‌న‌దారులు ప్ర‌త్య‌మ్న‌య దారుల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు అభ్యర్థించారు:

రవీంద్ర భారతి
AR పెట్రోల్ పంప్
ఇక్బాల్ మినార్
తెలుగు తల్లి జంక్షన్
అప్పర్ ట్యాంక్ బండ్
పాత అంబేద్కర్ విగ్రహం
కర్బలా జంక్షన్
బైబిల్ హౌస్
CTO జంక్షన్
ప్లాజా జంక్షన్
SBI జంక్షన్
టివోలి జంక్షన్

కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ మళ్లింపులను తొలగించ‌నున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Updated On 30 May 2024 11:29 PM GMT
Yagnik

Yagnik

Next Story