పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు ఆయన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. ఆయన రేపు నాగర్ కర్నూలు లో బహిరంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం 4.55 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మాల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. 6.40 గంటలకు రాజ్ భవన్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. రాత్రికి రాజ్ భవన్ లో బస ఏర్పాటు చేశారు. మార్చి 16వ తేదీ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. 11.45 నుంచి 12.45 గంటల వరకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి హెలికాప్టర్ లో గుల్బర్గా వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంటారు.

మార్చి 15-16 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 15న సాయంత్రం 4:40 గంటల నుంచి 7:00 వరకూ ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. మోదీ రోడ్ షో చేసే 5 కిలోమీటర్ల మేర రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లు, పారా గ్లైడర్లు ఎగురవేయడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐసీపీ సెక్షన్లు 188, 121, 121 ఏ, 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకోనున్నారు.

మార్చి 15న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు:
బేగంపేట
PNT జంక్షన్
రసూల్‌పురా
CTO
ప్లాజా
సెయింట్ జాన్స్ రోటరీ
సంగీత్ ఎక్స్ రోడ్స్
ఆలుగడ్డ బావి
మెట్టుగూడ
రైల్వే హాస్పిటల్ మెట్టుగూడ రోటరీ
మీర్జాలగూడ T జంక్షన్
మల్కాజిగిరి ఆర్చ్
లాలాపేట్
తార్నాక
గ్రీన్ ల్యాండ్స్
మోనప్ప జంక్షన్
రాజ్‌భవన్ MMTS జంక్షన్
VV విగ్రహం

మార్చి 16న ఉదయం 10:40 నుంచి 11:15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో పర్యటించనున్నారు. VIP కదలికల కారణంగా
VV విగ్రహం
మెట్రో రెసిడెన్సీ లేన్
MMTS రాజ్‌భవన్
పంజాగుట్ట
గ్రీన్లాండ్స్
HPS అవుట్ గేట్
బేగంపేట్ ఫ్లై ఓవర్
PNT ఫ్లైఓవర్.. ప్రాంతాల్లో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. లేదా వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు.

Updated On 14 March 2024 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story