31వ తేదీన కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
31వ తేదీన కొల్లాపూర్(Kollapur)లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport) నుండి నేరుగా ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కొల్లాపూర్ వెళ్తారని వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటన ఉంటుందని.. రెండవ విడత బస్సు యాత్రలో పాల్గొంటారని వివరించారు. ఈ నెల 26, 27 తేదీలో ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే(Manikrao Thackrey), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy), ఇతర సీనియర్ నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ నెల 28 నుండి రెండవ విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. త్వరలోనే పూర్తిస్తాయి షెడ్యూల్ వస్తుందన్నారు. లక్ష కోట్లు తీసుకెళ్లి కాళేశ్వరం(Kaleshwaram)లో పెట్టారు.. హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), కవిత(Kavith) దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
బుధవారం సీఈసీ సమావేశం(CEC Meeting) ఉందని.. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ ఎవరికి కేటాయించాలి అనేది స్క్రీనింగ్ కమిటీ చూసుకుంటుందని.. సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. రెండవ విడతలో బలమైన అభ్యర్థులందరికీ టికెట్లు వస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ స్థానాలు మైనారిటీలు అడుగుతున్నారని.. మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు న్యాయం చేస్తుందని తెలిపారు.