వచ్చే అయిదేళ్లు తెలంగాణకు(Telangana) రేవంత్‌రెడ్డినే(Revanth Reddy) ముఖ్యమంత్రిగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో(Gandhi Bhavan) మీడియాతో ముచ్చటించిన జగ్గారెడ్డి అయిదేళ్లపాటు రేవంత్‌ను ఎవరూ కదిలించలేరని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) మీద బీజేపీ(BJP) నేతలు ఆధారాలు లేని అభియోగాలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Jagga Reddy
వచ్చే అయిదేళ్లు తెలంగాణకు(Telangana) రేవంత్‌రెడ్డినే(Revanth Reddy) ముఖ్యమంత్రిగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో(Gandhi Bhavan) మీడియాతో ముచ్చటించిన జగ్గారెడ్డి అయిదేళ్లపాటు రేవంత్‌ను ఎవరూ కదిలించలేరని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) మీద బీజేపీ(BJP) నేతలు ఆధారాలు లేని అభియోగాలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరెడ్డి(Maheswar Reddy) ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానితే మంచిదని హితవు పలికారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెల్ల కాగితంలాంటి వారని, అలాంటి ఆయనపై ఇంక్ చల్లకండి అని చెప్పారు. మహేశ్వరెడ్డికి బట్టకాల్చి మీదేయడం అలవాటే అన్నారు. ఉత్తమ్ మీద ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందో చెప్పాలన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందని చెబుతూ తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి , మంత్రులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడి నష్టపోవొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమే అని తెలిపారు
