తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిష‌న్ రెడ్డిని నియ‌మించ‌డంపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామ‌ల కిర‌ణ్ కుమార్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

తెలంగాణ బీజేపీ చీఫ్‌(Telangana BJP Chief)గా కిష‌న్ రెడ్డి(Kishan Reddy)ని నియ‌మించ‌డంపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామ‌ల కిర‌ణ్ కుమార్(TPCC Vice President Chamala Kiran Kumar) సంచ‌ల‌న ట్వీట్(Twwet) చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌(Screen Shot)లు సోష‌ల్ మీడియా(Social Media)లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చామ‌ల కిర‌ణ్ కుమార్ కిష‌న్ రెడ్డి నియామ‌కంపై ట్విట‌ర్‌లో స్పందిస్తూ.. ఫైన‌ల్‌గా కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంలో బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్(BRS President KCR) విజయవంతం అయ్యార‌ని పేర్కొన్నారు. ట్వీట్‌ను కిష‌న్ రెడ్డి, జేపీ న‌డ్డా(JP Nadda), ప్ర‌ధాని మోదీ(PM Modi), కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి(Konda VishweshwarReddy), కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి(Komatireddy Rajagopalreddy), ఈటెల రాజేంద‌ర్‌(Etela Rajendar)కు ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్‌కు నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజ‌న్.. ఇప్పుడు బీజేపీ(BJP)లో ఎమ్మెల్యే సీట్లు కేసీఆర్ నిర్ణయిస్తారా? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌(Assembly Elections))లో టీఆర్ఎస్(TRS) గెలిచేందుకు బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసి.. ఎంపీ ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే కామెంట్ చేశారు. మ‌రో నెటిజ‌న్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్న‌ట్లుగా బీజేపీ రిస్తేజార్ స‌మితి(బీజేపీ బంధువుల పార్టీ) అని కామెంట్ చేశారు. మ‌రో నెటిజ‌న్ లిక్క‌ర్ స్కాంలో ఉన్న‌ క‌విత(MLC Kavitha) ఇష్యూను సైడ్ చేసేందుకు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ స్పందించారు.

Updated On 4 July 2023 9:03 PM GMT
Yagnik

Yagnik

Next Story