Revanth Reddy : ఇక దేవుడే దిక్కు !
తెలంగాణలో(Telangana) మరికొన్ని గంటల్లోనే పోలింగ్(Election Polling) జరుగనుంది. నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం(Campaign) చేసిన నేతలు..గెలుపోటముల భారాన్ని ఇక ఓటర్ దేవుళ్ల చేతిలో పెట్టారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలూ.. అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు ఓటర్లను(Voters) తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన పార్టీలూ, అభ్యర్థులు..ఇక దేవుడి అనుగ్రహం కోసం ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ఎంత ప్రచారం చేసినా..ఓటర్ల ఆశీర్వాదంతోపాటు దేవుడి దీవెనలు కూడా సెంటిమెంట్‌గా భావిస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే సెంటిమెంట్(Sentiment) కంటిన్యూ చేస్తూ బీజేపీ(BJP) నేతలు భాగ్యలక్ష్మి టెంపుల్‌ను(Bagyalaskhmi Temple) సందర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ఓటర్లను కోరారు.
అటు కాంగ్రెస్(Congress) ముఖ్య నేతలు కూడా బిర్లా మందిర్‌ను(Birla Mandhir) సందర్శించారు. అయితే ఎన్నికల(Election Code) కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసుల సూచనల మేరకు కేవలం రేవంత్(Revanth), ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి మాత్రమే బిర్లామందిర్‌కు వెళ్లారు. బిర్లా మందిర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామికి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి మరీ రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు.