హైదరాబాద్ లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింద‌ని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్(KTR) గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

హైదరాబాద్ లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింద‌ని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్(KTR) గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని దుయ్య‌బ‌ట్టారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడంలేదని మండిప‌డ్డారు.

వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందన్నారు. తీవ్ర వర్షాలతో వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అలెర్ట్ ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివర్ణించారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్.. హైదరాబాద్‌ను నరక కూపంగా మార్చారని మండిప‌డ్డారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. పాత భవనాలు, గోడలు, పాడు బడ్డ ఇళ్ల వద్ద జాగ్రత్త గా ఉండాలని.. పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. రాష్ట్రంలో గతంలో వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు, పంట నష్టాలు జ‌రిగాయి. గత 9 ఏళ్లుగా హైదరాబాద్ లో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదని విమ‌ర్శించారు. ఈ విషయాలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. బుధ, గురు వారాలలో రెండు రోజులలో ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలని.. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రిక జారీచేశారు.

Updated On 26 July 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story