ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియం(Saroornagar Indoor Stadium)లో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతున్నామని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ(Rahul Gandhi) రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్ ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు,

Revanth Reddy
ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియం(Saroornagar Indoor Stadium)లో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతున్నామని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ(Rahul Gandhi) రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్ ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తామని తెలిపారు.
ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్ ను అడగడం కాదు.. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని.. అందుకే ఈ యువ సంఘర్షణ సభ అని అన్నారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతుగా తరలి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
