Revanth Reddy : రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టండి
రైతుబంధు(Rythu bandhu) రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి(Election Commission) మేం విజ్ఞప్తి చేసామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. డోర్నకల్(Dornakal) సభలో యాన మాట్లాడుతూ.. ఈసీ అనుమతి ఇచ్చినా..

Revanth Reddy
రైతుబంధు(Rythu bandhu) రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి(Election Commission) మేం విజ్ఞప్తి చేసామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. డోర్నకల్(Dornakal) సభలో యాన మాట్లాడుతూ.. ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు(Harish Rao) నోటిదూల, కేసీఆర్(KCR) అతి తెలివి వల్ల రైతు బంధు ఆగిందన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయన్నారు. మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.. రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్(BRS) నేతలను తరిమికొట్టండని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయని రేవంత్ అన్నారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయినాయ్.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబర్ 30న అల్లుడు హరీష్‌కు, మామ కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా.. ప్రతీ ఎకరాకు రూ.15 వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దన్నారు.
