ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని టీపీసీసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్రసార మాధ్యమాల్లో కొత్తగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ మంత్రులకు శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపులు జరగలేదని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. శాఖల కేటాయింపులు జరిగినట్టు ప్రసారం అవుతున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది.

ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని టీపీసీసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్రసార మాధ్యమాల్లో కొత్తగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ మంత్రులకు శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపులు జరగలేదని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. శాఖల కేటాయింపులు జరిగినట్టు ప్రసారం అవుతున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది. మంత్రులకు శాఖల కేటాయింపుల వివరాలు.. ప్రభుత్వం ఆదేశాల రూపంలో ప్రకటిస్తుందని వెల్ల‌డించింది. ప్రభుత్వం ఆదేశాలు ప్రకటించే వరకూ శాఖల కేటాయింపులపై ప్రసారాలు చేయవద్దని కోరింది.

ఇదిలావుంటే.. సీఎం రేవంత్‌తో పాటు.. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేశారు. వీరితో పాటు గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం స్పీక‌ర్‌గా ప్ర‌క‌టించింది.

Updated On 8 Dec 2023 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story