భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని కుంభం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి..
భువనగిరి(Bhuvanagiri) డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil Kumar Reddy)తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని కుంభం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆయనను కలిశారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్(BRS) లో చేరారు. తిరిగి కాంగ్రెస్(Congress) లోకి రావాలని రేవంత్ రెడ్డి ఆయనను ఆహ్వానించారు. అందుకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో ఓడినా కుంభం అనిల్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతీ కార్యక్రమాన్ని అనిల్ విజయవంతం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజం.. కాంగ్రెస్ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలింది. అధిష్టానం ఆదేశాలతో అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించాం అని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో కుంభం అనిల్ సొంతగూటికి చేరారని.. ఆయనకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తాం అని వెల్లడించారు. భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అన్నారు. ఈ క్షణం నుంచి భువనగిరి కార్యకర్తలకు అనిల్ అండగా ఉంటారని తెలిపారు.