తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామంటున్నారని అన్నారు.

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24 గంటలు సింగిల్ ఫేజ్(Single Phase) మాత్రమే ఇస్తున్నామంటున్నారని అన్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా.? నువ్వు మంత్రివా? లేక ఆ శాఖలో బంట్రోతువా? అని జ‌గ‌దీశ్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసలు నువ్వు ఎప్పుడైనా ఉచిత విద్యుత్(Free Current) పై సమీక్ష చేశావా? అని ప్ర‌శ్నించారు.

ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేశారని మండిప‌డ్డారు. కాంగ్రెస్(Congress) హయాంలో ప్రతీ నెల 1వ తేదీనే విద్యుత్ ఉద్యోగుల ఖాతాల‌లో జీతాలు పడేవి. కానీ బీఆర్ఎస్ పాలనలో 20వ తేదీ వచ్చినా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదని.. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారిందని.. ఇందుకు సిగ్గుతో తలవంచుకుని జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ(Telangana) రైతాంగానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది జగదీష్ రెడ్డే న‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Updated On 18 July 2023 9:12 PM GMT
Yagnik

Yagnik

Next Story