ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సాయంత్రం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్ గా బాగ్యాలక్మి దేవాలయానికి చేరుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు పెద్దఎత్తున నాయకులు తరలివెళ్లారు.
మునుగోడు ఎన్నికల్లో(Munugode Bypoll) రూ.25 కోట్లు కాంగ్రెస్(Congress) కు కేసీఆర్(KCR) ఇచ్చారని ఈటెల రాజేందర్(Etela Rajendar) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సాయంత్రం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్ గా బాగ్యాలక్మి(Bhagyalaxmi Temple) దేవాలయానికి చేరుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revantn Reddy). ఆయన వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్(Anjankumar Yadav) తో పాటు పెద్దఎత్తున నాయకులు తరలివెళ్లారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రేవంత్.. గర్భ గుడిలో నిల్చొని ప్రమాణం చేశారు. అన్ని విషయాలు అమ్మవారి టెంపుల్ దగ్గరే మాట్లాడుతానని పేర్కొన్న రేవంత్.. ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు.
అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారి గర్భ గుడిలో నిలబడి అమ్మవారి మీద ఒట్టేసి చంద్రశేఖర రావు(Chandrashekar Rao)తో ఎలాంటి లాలూచీ లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకూ.. కేసీఆర్ తో కొట్లాడతాం. రాజీ నా రక్తంలో లేదని స్పష్టం చేశారు. భయం నా ఒంట్లో లేదు. అమ్మవారి కండువా కట్టుకొని ప్రమాణం చేస్తున్నా.. నేను కేసీఆర్(KCR) తో కొట్లాడుతున్నప్పుడు నువ్వు కేసీఆర్ పక్కన నిలబడి ఉన్నావ్ అని ఈటెలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పక్కన సాక్షిగా నువ్వే కదా ఉన్నది.. అమ్ముడుపోయే వాడిని అయితే.. నీ లెక్క మంత్రిని అయ్యే వాడినని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్, కేటీఆర్(KTR) దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నన్నాళ్లు 16 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొని నిటారుగా నిలబడ్డా రాజేంద్రా.. నోటీసులు ఇవ్వగానే ఎవరికో నేను లొంగిపోలేదు రాజేంద్రా.. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తావా.. ఇదేనా కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్ ఇస్తున్న గౌరవం అంటూ నిలదీశారు. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా అని ప్రశ్నించారు. నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కదా రాజేంద్రా.. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు.. ఆలోచించి మాట్లాడు.. నీపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన రాజేంద్ర.. ఇలాంటి ఆరోపణలు మంచివి కాదని సూచించారు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా.. నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమేనని స్పష్టం చేశారు.