ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) లీగల్ నోటీసుకు టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) స‌మాధానం ఇచ్చారు. లీగల్ నోటీసులో పలు అంశాలతో కౌంటర్ ఇచ్చారు రేవంత్. లీగల్ నోటీస్(Legal Notice) ను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కౌంటర్ లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రం గా జరిగింది.. తెలంగాణ ఉద్యమం తో కేటీఆర్ కు సంబంధం లేదు.. ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదు. టీఎస్పీఎస్సీ(TSPSC) ఉద్యోగాల విషయంలో […]

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) లీగల్ నోటీసుకు టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) స‌మాధానం ఇచ్చారు. లీగల్ నోటీసులో పలు అంశాలతో కౌంటర్ ఇచ్చారు రేవంత్. లీగల్ నోటీస్(Legal Notice) ను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కౌంటర్ లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రం గా జరిగింది.. తెలంగాణ ఉద్యమం తో కేటీఆర్ కు సంబంధం లేదు.. ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదు. టీఎస్పీఎస్సీ(TSPSC) ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడాన‌ని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుంది. అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతాడు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారా నే జరిగిందని పేర్కొన్నారు.

పేపర్ లీక్, పేపర్ అవుట్ కు తేడా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది. ఎస్ఎస్‌సీ పేపర్ అవుట్ అయ్యిందని పేర్కొన్నారు. ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే వాళ్ళు పరీక్షా కేంద్రాల్లోనే ఉండగానే పేపర్ అవుట్ అయ్యిందని.. పేపర్ అవుట్ కు, పేపర్ లీక్ కు చాలా తేడా వుందని వివ‌రించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్.. పరీక్షకు చాలారోజుల ముందే బయటికొచ్చిందని అన్నారు. బండి సంజయ్ కుట్ర నిజమైతే.. బెయిల్ పై ప్రభుత్వం కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్ర‌శ్నించారు.

బీజేపీ(BJP), కేసీఆర్(KCR) ఒప్పందంలో భాగంగానే ఈ డ్రామా అని విమ‌ర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) లో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లే కాదు.. చాలామంది వున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డునే రద్దుచేసి పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా.. కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారని అన్నారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన సిట్.. చైర్మన్, సెక్రెటరీ, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారు. ముద్దాయిలు వేరు, సాక్షులు వేరు.. కాన్ఫిడెన్షియ‌ల్‌ విషయాలు కేటీఆర్ కు ఎట్లా తెలుస్తున్నాయి. సిట్ అధికారులు చెబుతున్నారా..? అని అనుమానం వ్య‌క్తం చేశారు.

Updated On 8 April 2023 9:25 AM GMT
Yagnik

Yagnik

Next Story