టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఇందిరా భవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

TPCC general meeting was held at Indira Bhavan
టీపీసీసీ(TPCC) విస్తృతస్థాయి సమావేశం ఇందిరా భవన్(Indira Bhavan)లో జరిగింది. సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)కి అభినందనలు తెలుపుతూ మొదటి తీర్మానం.. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thackrey) అభినందిస్తూ రెండవ తీర్మానం.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్(Congress) సర్కార్ అమలు చేసి తీరుతుందన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాదని అన్నారు. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్(BRS) కు బుద్ది రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణ(Telangana)ను బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు.
బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నిక(Loksabha Elections)ల్లో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలని సూచించారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానని వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ఆదాయం తగ్గినట్టుందని.. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని.. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారని ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం(Kaleshwaram) అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతామన్నారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) తోడు దొంగలు.. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు.. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని అన్నారు
