పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీని ప్రకటించింది.

TPCC Committee for Redressal of Parliament Election Grievances
పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీని ప్రకటించింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లతో టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీని ప్రకటించారు. నిన్న జరిగిన ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలు, ఫిర్యాదులు పరిష్కారానికి టీపీసీసీ కమిటీ వేసింది. రాష్ట్రంలో నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.
