టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy).. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాదయాత్ర క్యాంపుకు వద్దకు చేరుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఉన్న భట్టి పాదయాత్ర క్యాంపుకు వద్దకు వెళ్లిన రేవంత్ కు.. భట్టి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి పాదయాత్రకు రేవంత్ సంఘీభావం తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Revanth Reddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy).. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాదయాత్ర క్యాంపుకు వద్దకు చేరుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఉన్న భట్టి పాదయాత్ర క్యాంపుకు వద్దకు వెళ్లిన రేవంత్ కు.. భట్టి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి పాదయాత్రకు రేవంత్ సంఘీభావం తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. సభా ఏర్పాట్లకు సంబంధించి భట్టి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరవుతారని వెల్లడించారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారవాన్ని పూరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డుగోడలు పెట్టినా.. కాంగ్రెస్ కార్యకర్తలు పడగొట్టి తొక్కుకుంటూ సభకు హాజరవుతారని అన్నారు. తెలంగాణ జన గర్జన సభకు ఖమ్మం జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందన మీరే చూస్తారని జోష్యం చెప్పారు.
