టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)సోమవారం కొత్త సచివాలయాని(New Secretariat)కి వెళ్లేందుకు బయలుదేరగా టెలిఫోన్ భవన్(Telephone Bhavan) వద్ద పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి అరవింద్ కుమార్(Arvind Kumar) ను కలిసేందుకు రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్
టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)సోమవారం కొత్త సచివాలయాని(New Secretariat)కి వెళ్లేందుకు బయలుదేరగా టెలిఫోన్ భవన్(Telephone Bhavan) వద్ద పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి అరవింద్ కుమార్(Arvind Kumar) ను కలిసేందుకు రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్(BR Ambedkar Secretariat)కు బయలుదేరగా అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఔటర్ రింగ్ కాంట్రాక్టు అంశంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి.. తాను మునిసిపల్, హెచ్ఎండీఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నాను అని పోలీసులతో చెప్పారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో.. ఒక ఎంపీకి ప్రత్యేకంగా అనుమతి ఏమిటీ. ఎంపీగా నా కార్డు నాకు అనుమతి.. నన్ను అడ్డుకోవడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన కారులో వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే.. పోలీసులు వారి కారులోనే తనను అధికారి వద్దకు తీసుకెళ్లవచ్చునని చెప్పారు.