రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఎల్బీ న‌గ‌ర్ లో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను సంద‌ర్శించడానికి వెళ్లిన ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఎల్బీ న‌గ‌ర్ లో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను సంద‌ర్శించడానికి వెళ్లిన ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారింది. పాలకుల కక్కుర్తి వల్లే కాలనీలు వరదల్లో మునిగిపోయాయని విమ‌ర్శించారు. నిజాం కాలం నాటి చేరువులన్నీ 90 శాతం బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని.. చెరువుల ఆక్రమణ‌లతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయని ఆరోపించారు.

హైదరాబాద్(Hyderabad) నగరంపై కేటీఆర్ వి(KTR) ఆర్భాటపు ప్రకటనలేన‌ని అన్నారు. హైదరాబాద్ నగరం పరిస్థితి మేడిపండు చందంగా మారిందని ఎద్దేవా చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిప‌డ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం సమీక్షలు చేయలేదని విరుచుకుప‌డ్డారు. ప్రగతి భవన్(Pragathi Bhavan) చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీఆర్ కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని అన్నారు. రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి కోసమే ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఆయన మూసికి చైర్మన్ అయ్యి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారని అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15వేలు ఇవ్వాలని.. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించి ఆర్థిక సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20వేలు అందించాలని కోరారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది.. సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద నీటిలో పిండ ప్రదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం తక్షణ వరద సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కు రాజకీయాలు చెల్లవని అన్నారు. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివ‌రించాల‌ని కోరారు. పార్లమెంటులో అమిత్ షా ను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామ‌ని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated On 29 July 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story