టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుక్రవారం కొడంగల్(Kodangal) బీఆర్ఎస్ నాయకుడు(BRS Leader), మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో(Ex-MLA Gurunath Reddy) భేటీ అయ్యారు. గత కొంత కాలంగా గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని గురునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్.. ఆయనతో సమావేశమయ్యారు.

Breaking News
టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుక్రవారం కొడంగల్(Kodangal) బీఆర్ఎస్ నాయకుడు(BRS Leader), మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో(Ex-MLA Gurunath Reddy) భేటీ అయ్యారు. గత కొంత కాలంగా గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని గురునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్.. ఆయనతో సమావేశమయ్యారు. గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలోనూ కొడంగల్ లో గురునాథ్ రెడ్డిని రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ వెంట గురునాథ్ రెడ్డిని కలిసిన వారిలో మాజీమంత్రి చిన్నారెడ్డి(chinna Reddy), మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) ఉన్నారు. ఇదిలావుంటే.. గత ఎన్నికలలో రేవంత్ కొడంగల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం లోక్ సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ మరోమారు కొడంగల్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు.
