✕
Revanth Reddy : అతడే ఒక సైన్యం..కాంగ్రెస్‌కు అధికారం -పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
By EhatvPublished on 4 Dec 2023 5:18 AM
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఎట్టకేలకు సాధించింది. పదేళ్ల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. దశాబ్ద కాలం అధికారానికి దూరమైన కాంగ్రెస్(congress) పార్టీని తెలంగాణలో తొలిసారి గద్దెనెక్కించిన ఘనత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికే(TPCC revanth Reddy) దక్కింది. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి..తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన ఘతన కూడా రేవంత్‌రెడ్డిదే. అతడే ఒక సైన్యమై..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి..చరిత్ర సృష్టించారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి..అధికారానికి చేరువ చేసిన అనుమలు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ.

x
Revanth Reddy
-
- తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఎట్టకేలకు సాధించింది. పదేళ్ల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. దశాబ్ద కాలం అధికారానికి దూరమైన కాంగ్రెస్(congress) పార్టీని తెలంగాణలో తొలిసారి గద్దెనెక్కించిన ఘనత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికే(TPCC revanth Reddy) దక్కింది. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి..తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన ఘతన కూడా రేవంత్‌రెడ్డిదే. అతడే ఒక సైన్యమై..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి..చరిత్ర సృష్టించారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి..అధికారానికి చేరువ చేసిన అనుమలు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ.
-
- అనుముల రేవంత్‌రెడ్డి(Anumula Revanth Reddy)..ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. తెలంగాణ రాజకీయాల్లో పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి. తెలంగాణలోనే రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఎన్నికల్లో ఎదుర్కొని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు రేవంత్‌రెడ్డి. అరెస్సెస్‌తో మొదలైన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు..వివాదాలూ, ఓటములు, అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నేతల నుంచి అనేక విమర్శలు ఎదురైనా..మాస్ ఫాలోయింగ్‌తో వాటంన్నింటినీ ఎదుర్కొంటూనే తనదైన దూకుడుతో దూసుకెళ్లారు. జనాకర్షక నేతగా ఎదిగారు రేవంత్‌రెడ్డి.
-
- ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahaboob Nagar) జిల్లా కొండారెడ్డిపల్లిలో 1969లో రేవంత్‌రెడ్డి జన్మించారు. తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. ఏవీ కళాశాల నుంచి బీఏ పట్టభద్రులయ్యారు. అయితే డిగ్రీ(Degree) పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్(Printing Press) స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో...రియల్ ఎస్టేట్(Real Estate) రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్‌రెడ్డి.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి(Jaipal) సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.
-
- ఇక రేవంత్‌రెడ్డికి చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలున్నాయి. పాఠశాలలో చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుగ్గా పని చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఆరెస్సెలో కొనసాగారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబుకు నమ్మినబంటులా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఫ్లోర్‌లీడర్‌గానూ పనిచేశారు.
-
- అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్‌రెడ్డి 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయారు రేవంత్‌రెడ్డి. అయితే రేవంత్‌రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిటెండ్‌గా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్‌కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి..పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఇరుకునపెడుతూ వచ్చారు.
-
- అయితే కాంగ్రెస్ పార్టీ తనను తానే ఓడించుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించే మాట. గత పదేళ్లలోనూ తెలంగాణలో అదే జరిగింది. పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా..అసమ్మతులతో తల బొప్పికట్టేది. రేవంత్ పీసీసీ అయ్యాక కూడా సమస్యలు తప్పలేదు. అధిష్టానం జోక్యం చేసుకొని.. సీరియ్ కావటంతో నేతలంతా దారిలోకి వచ్చారు. రేవంత్ కూడా పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు శ్రమించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కొందరు ముఖ్య నేతలకే నమ్మకం లేని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. దాని కోసం లోతైన కసరత్తు చేశారు. ఢిల్లీ ఉంచి గల్లీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఎవరి పని వారు చేశారు. ప్రచార వ్యూహం దగ్గరి నుంచి టికెట్ల పంపిణీ వరకు చాలా జగ్రత్తలు తీసుకున్నారు.
-
- రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు సాగించారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన రేవంత్‌రెడ్డి..‘మార్పు కావాలి–కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ముందుకు కదిలారు. పార్టీలోని చాలా మంది ముఖ్య నేతలు, స్టార్ క్యాంపెయినర్లు తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం సాగించగా.. రేవంత్‌రెడ్డి మాత్రమే ఒక్కడే.. ఒంటరిగా రాష్ట్రమంతా తిరుగుతూ అభ్యర్థులకు అండగా ఉంటూ వచ్చారు. అధికార పార్టీ బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు కురిపిస్తూ.. తొమ్మిదిన్నరేళ్ల పాలనలోని తప్పులను ఎండగడుతూ జన చైతన్యాన్ని రగిలించారు. అతడే ఒక సైన్యమై కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చగలిగారు.
-
- తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి రావడం వెనుక నేతల సమిష్టి కృషి ఉంది. అయితే రేవంత్ అనుసరించిన వ్యూహాలు కీలకంగా మారాయి. కురు వృద్ధ కాంగ్రెస్‌ను గెలుపు తీరానికి చేర్చిన యువ నేతగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో రాష్ట్రమంతా హోరెత్తించిన రేవంత్‌రెడ్డి.. ఎట్టకేలకు పార్టీకి విజయం అందించారు. కాంగ్రెస్‌లో అతి తక్కువ కాలంలో ఈ స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పార్టీలో ఒక పదవి దక్కాలంటే దశాబ్దాల పాటు శ్రమిస్తే తప్ప కల సాకారం కాదు. కానీ, రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రెండేళ్లకే.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి..చరిత్ర సృష్టించారు రేవంత్‌రెడ్డి.

Ehatv
Next Story